Aamir Khan: ‘లాల్‌’ కోసం ఆమిర్‌ కీలక నిర్ణయం..!

సినిమా హిట్‌ని, లాభాలను తీసుకొని ఎంతగా లాభపడతారో, ఆ సినిమా పోయినప్పుడు దాని నష్టాన్ని కూడా భరించాలి అంటుంటారు. భారతీయ సినిమాలో ఇలాంటి హీరోలు కొంతమంది ఉన్నారు. కొందరు ఈ విషయం బయటకు చెప్పి చేస్తే.. ఇంకొందరు తెలియకుండా చేస్తారు. అయితే ఇప్పుడు ఆమిర్‌ ఖాన్‌ కూడా ఇలా నష్టాల్ని భరించడానికి సిద్ధమయ్యాడని టాక్‌. ఆయన నుండి ఇటీవల వచ్చిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమా దారుణమైన ఫలితం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నష్టాలు భరించడానికి సిద్ధమవుతున్నారట.

ఎన్నో అంచనాలతో ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఆగస్టు 11న విడుదలైన విషయం తెలిసిందే. తెలుగులో చిరంజీవి సమర్పణ అంటూ ఓ ట్యాగ్‌ కూడా యాడ్‌ చేశారు. అయినప్పటికీ సినిమా ఫలితం దారుణంగా నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమాను కొనుక్కున్నవారు తీవ్రమైన నష్టాల బారిన పడ్డారని సమాచారం. రెండో రోజు నుండే చాలా ప్రాంతాల్లో సినిమా షోలు రద్దు అయిపోయాయి. ఈ సినిమాకు సుమారు రూ. 180 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేశారట.

అందులో రూ. 70 కోట్ల రూ. 80 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయని టాక్‌. దీంతో ఆమిర్‌ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమాకుగానూ ఆమిర్‌ ఖాన్‌ రెమ్యూనరేషన్‌గా రూ.50కోట్లు తీసుకున్నారని టాక్‌. ఇప్పుడు ఆ సొమ్ముని వదులుకుని నిర్మాతలకు నష్టాన్ని తగ్గించాలనుకుంటున్నారట. ఈ నిర్ణయంతో ఆమిర్‌ ఖాన్‌కు ఈ సినిమా వల్ల మొత్తం రూ. 100 కోట్ల నష్టం వచ్చినట్లు చెబుతున్నారు.

హీరోగా రెమ్యూనరేషన్‌, సినిమా వసూళ్లలో వాటా కలిపి మొత్తం ఇంత లాస్‌ ఉండొచ్చు అని అంటున్నారు. నిజానికి గత పదేళ్లలో ఆమిర్‌ ఖాన్‌ ప్రతి చిత్రం రూ.100 కోట్ల మార్కు అందుకున్నాయి. ఈ సినిమానే ఇలా దారుణంగా నిలిచింది. అయితే సినిమాకు బాయ్‌ కాట్‌ సెగ తగలడంతోపాటు, సినిమా కథ, కథనం విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇవన్నీ కలిపి సినిమాకు దారుణమైన ఫలితం ఇచ్చాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus