గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. ‘జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్’ పతాకం పై తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ నిజానికి 2011 లో మొదలైంది. అప్పటి నుండీ మూలనపడి ఉన్న ఈ చిత్రాన్ని 2017 లో రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు.కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా అది కూడా కుదర్లేదు. అయితే ఎట్టకేలకు 2021 అక్టోబర్ 8న రిలీజ్ చేశారు.పాత సినిమా కావడం పైగా పోటీగా ‘కొండపొలం’, ‘డాక్టర్ వరుణ్’ వంటి సినిమాలు ఉండడంతో ‘ఆరడుగుల బుల్లెట్’ ను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. మాస్ సెంటర్స్ లో కొంతవరకు ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ చిత్రం ఫుల్ రన్లో జోరు చూపించలేకపోయింది.
నైజాం | 0.43 cr |
సీడెడ్ | 0.22 cr |
ఉత్తరాంధ్ర | 0.27 cr |
ఈస్ట్ | 0.15 cr |
వెస్ట్ | 0.11 cr |
గుంటూరు | 0.13 cr |
కృష్ణా | 0.11 cr |
నెల్లూరు | 0.10 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.52 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.11 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.63 cr |
‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రానికి రూ. 2.95 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ. 3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.1.63 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.దాంతో బయ్యర్లకు రూ.1.37 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?