బిగ్ బాస్ హౌస్ లో నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ఓటింగ్ రిక్వస్ట్ టాస్క్ అనేది జరుగుతోంది. ఈసారి అఖిల్ తప్ప హౌస్ లో ఉన్నవారందరనీ బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేశాడు కాబట్టి, డైరెక్ట్ గా ప్రజలతో మాట్లాడుకునే గోల్డెన్ ఆపర్చునిటీని గోల్డెన్ మైక్ ద్వారా అందించాడు. దీనికోసం, రూలర్, ఓపిక, ఏకాగ్రత, డ్యాన్స్ టాస్క్ లని పెట్టాడు. వీటిలో వేటిలోనూ హారిక ఇంకా అభిజిత్ లు గెలవలేదు.
డ్యాన్స్ టాస్క్ లో కూడా అరియానా నేను తర్వాత దిగుతాను, సోహైల్ ని ముందు దిగిపోమన్నట్లుగా వాదన పెట్టుకుంది. దీంతో అభిజిత్ స్టేజ్ పైన కూర్చుండి పోయాడు. టాస్క్ లో రూల్ ప్రకారం స్టేజ్ పైన కూర్చోకూడదు, నిలబడకూడదు, స్టేజ్ దిగి వెళ్లకూడదు. డ్యాన్స్ చేస్తూనే ఉండాలి. కానీ అభిజిత్ కూర్చోవడం వల్ల హానెస్ట్ గా దిగిపోయాడు. దీంతో ఓటింగ్ రిక్వస్ట్ చేయకుండానే ప్రజల హృదయాలని గెలుచుకున్నాడు.
ఆతర్వాత మోనాల్ హారిక ఇద్దరూ మాత్రమే చివరకి మిగిలారు. దీంతో హారిక మోనాల్ కోసం స్టేజ్ దిగిపోయింది. స్టేజ్ దిగిపోతూ నువ్వు నన్ను ఎత్తుకుని కెప్టెన్ ని చేశావ్, కానీ నీకు నేను ఏమీ ఇవ్వలేకపోయాను. కాబట్టి ఇప్పుడు ఇస్తున్నా అంటూ హారిక మాట్లాడింది. దీంతో మోనాల్ చాలా ఆనందంగా టాస్క్ లో విజయం సాధించి గోల్డెన్ మైక్ ని అందుకుంది. ఫస్ట్ టైమ్ టాస్క్ లో గెలిచి ప్రజలతో మాట్లాడుతుంటే ట్రోఫీ గెలిచినంత బాగుంది అంటూ మోనాల్ అఖిల్ తో చెప్పింది.
ఇక అభిజిత్, హారిక ఇద్దరూ ఈ టాస్క్ ని శాక్రిఫైజ్ చేసినా కూడా ప్రజల హృదయాలని గెలుచుకున్నారు. వాళ్లు ఓటింగ్ రిక్వస్ట్ చేసినా ఒకటే వీళ్లూ చేయకపోయినా ఒకటే అన్నట్లుగా అయ్యింది పరిస్థితి. అదీ మేటర్.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!