బిగ్ బాస్ 4: సీజన్ కే హైలెట్ రోబో టాస్క్..!

బిగ్ బాస్ హౌస్ లో నెంబరింగ్ గేమ్ తర్వాత అభిజిత్ ఆరో స్థానంలో నించున్నాడు. దీంతో తను వరెస్ట్ పెర్ఫామర్ అని ఆర్గ్యూ చేయకుండానే ఒప్పుకున్నాడు. అందుకే, బిగ్ బాస్ ఆదేశం మీరకు జైల్ కి కూడా వెళ్లాడు. తను ఓవర్ ఆల్ గా సీజన్ మొత్తం వరెస్ట్ పెర్ఫామర్ అన్నా కూడా పర్లేదు అంటూ మాట్లాడాడు. అయితే, ఇక్కడే అభిజిత్ పై సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. డౌన్ టు ఎర్త్ ఎలా ఉండాలో అభిజిత్ ని చూసి నేర్చుకోవాలని, అభిజిత్ వరెస్ట్ కాదు ద బెస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు , అభిజిత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఓటింగ్ లో తమ సత్తాని చాటుతున్నారు.

మరోవైపు సీజన్ కే హైలెట్ అయిన రోబో టాస్క్ ని షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వ్యూజవల్స్ ని ప్లే చేస్తూ అభిజిత్ పై ఎవిలు సైతం క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం 13వ వారంలో అభిజిత్ ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు. ఇంకా ఒకే ఒక్కసారి సేఫ్ అయితే, టాప్ – 5 లోకి వెళ్లిపోతాడు. మిగతా వాళ్ల గేమ్ ఎలా ఉన్నా కూడా అభిజిత్ నామినేషన్స్ లోకి వచ్చిన అన్నిసార్లు ఓటింగ్ లో టాప్ లోనే ఉన్నాడు.

దీనిని బట్టే ఫ్యాన్స్ ఇప్పుడు అభిజిత్ ని విన్నర్ ని చేయాలని డిసైడ్ అయినట్లుగానే కనిపిస్తోంది. ఇంకా ఒక్కవారంలో ఎవరి గ్రాఫ్ అయినా పూర్తిగా మారితే చెప్పలేం కానీ, ప్రస్తుతానికి లెక్కలు చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో అభిజిత్ వరెస్ట్ పెర్ఫామర్ అంటూ జైల్ కి వెళ్లడం అనేది ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. అంతేకాదు, సీజన్ మొత్తానికి వరెస్ట్ అనేసరికి అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదీ మేటర్.

[yop_poll id=”1″]
Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus