మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. మాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రాంచరణ్ సహా నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా చరణ్ ఈ చిత్రంలో సిద్ధ అనే పాత్రని పోషించడం కూడా జరిగింది. అతనికి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుంచి భారీగా నమోదవడంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.కానీ విడుదలైన మొదటి రోజు మొదటి షోతోనే ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ రావడంతో ఒక్కసారిగా కలెక్షన్లు పడిపోయాయి.
కొరటాల సినిమా ఇలా ఉందేంటి అంటూ అంతా నెత్తి, నోరు కొట్టుకుంటున్నారు. అయినప్పటికీ మొదటి నుండీ నెలకొన్న హైప్ కారణంగా ‘ఆచార్య’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల మొదటి రోజు డీసెంట్ కలెక్షన్లు నమోదయ్యాయి. రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.అయితే టికెట్ రేట్లు హైక్ ఉన్నప్పటికీ.. వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ‘ఆచార్య’ కి కలిసొస్తుంది ఏమీ లేదనే చెప్పాలి. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.31.93 కోట్ల షేర్ ను రాబట్టింది.
కానీ రెండో రోజు దారుణంగా పడిపోయాయి. అందుతున్న సమాచారం ప్రకారం రెండో రోజు ఈ చిత్రం రూ.8 కోట్ల వరకు షేర్ ను నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.దీంతో మొత్తంగా రూ.40 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసే అవకాశం ఉండొచ్చు. ఆదివారంతో పాటు రంజాన్ హాలిడే కూడా ఉంది. మరి ఆ అవకాశాలను ఎంతవరకు వాడుకుంటుందో చూడాలి. ‘ఆచార్య’ బ్రేక్ ఈవెన్ కు రూ.134 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.