Kushi: విజయ్‌ కోసం ప్లాన్‌ మార్చారా.. లేక ముందే అనుకున్నారా?

హీరో బట్టి, హీరో ఫామ్‌ బట్టి కథలో మార్పులొస్తాయా? మిగతా దగ్గర్ల ఏమో కానీ.. టాలీవుడ్‌లో మాత్రం వస్తాయి అంటుంటారు. గత సినిమా హీరోకు మంచి విజయాన్ని ఇస్తే అదే ఫార్ములా తర్వాతి సినిమాలో ఉండేలా చూసుకుంటారు. ఒకవేళ గత సినిమా సరైన ఫలితం ఇవ్వకపోతే.. ఇమేజ్‌కి తగ్గట్టుగా కథలో మార్పులు చేస్తుంటారు. అప్పటికే సినిమా కాస్త షూటింగ్‌ జరుపుకున్నా ఈ మార్పులు ఉంటాయి అంటుంటారు. గతంలో ఏ సినిమాకు ఇలా జరిగిందో చెప్పలేం కానీ.. తాజాగా ‘ఖుషి’ సినిమాకు జరుగుతోంది అంటున్నారు.

విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఖుషి’. చాాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా సమత అనారోగ్యం కారణంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ మొదలైంది. అయితే ఈ క్రమంలో సినిమా కాన్సెప్ట్‌కి, చెప్పిన మాటలకు దూరంగా ఓ మాట వినిపిస్తోంది. అదే యాక్షన్‌ సీన్స్‌. ‘ఖుషి’ ఫుల్‌ ప్లెడ్జ్‌ లవ్‌ స్టోరీ అంటూ తొలి రోజుల నుండి చెప్పుకొస్తున్నారు. అన్నట్లుగా పోస్టర్‌, ఫొటోలు కనిపిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు యాక్షన్‌ సీన్స్‌ కోసం పీటర్‌ హెయిన్స్‌ను రంగంలోకి దింపడంతో ఏంటి కథలో మార్పు జరిగిందా అంటున్నారు.

త్వరలో కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడు పీటర్‌ హెయిన్స్‌ రావడంతో షెడ్యూల్‌ సంగతి తేలింది. మార్చి 8 నుండి కొత్త షెడ్యూల్‌ ప్రారంభిస్తారట. ఆ రోజు సమంతకు గ్రాండ్‌ వెల్కమ్‌ చెబుతారు అని కూడా తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఆ సంగతి పక్కనపెడితే.. సినిమాలోకి ఎందుకు యాక్షన్‌ సీన్స్‌ వచ్చాయి అనేది టాక్‌. ‘లైగర్‌’తో దారుణ పరాజయం పాలైన విజయ్‌ దేవరకొండ ఇప్పుడు ‘ఖుషి’లో కాస్త మాస్‌ ఎలిమెంట్స్‌ పెట్టి మాస్‌ ఇమేజ్‌ కంటిన్యూ చేసే పనిలో ఉన్నాడు అంటున్నారు.

అయితే నిజంగా తొలుత నుండి ఈ సినిమాలో ఫైట్స్‌ ఉన్నాయా? లేక ఇప్పుడే పెట్టారా అనేది తెలియాలి. ఈ సినిమాలో విజయ్‌ ఆర్మీ అధికారిగా కనిపిస్తాడని టాక్‌. ఆ కోణంలో ఏవైనా యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయా అనేది చూడాలి. ఒకవేళ అవే ఉంటే ఈపాటికి గ్యాప్‌ లేకుండా, సమంత కోసం చూడకుండా తీసేసేవారు కదా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus