సీనియర్ నటుడు చలపతిరావు శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చలపతిరావు ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేవారు. ఆయన్ను దగ్గరుండి చూసేవారు మాత్రం ఆ చిరునవ్వు వెనుక ఎంతో విషాదం దాగి ఉందని చెబుతారు. మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ ఆయన దాన్ని బయటకు చూపించేవారు కాదని అంటారు. ఆయన జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. చలపతిరావు భార్య పేరు ఇందుమతి.
వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. చెన్నైలో ఓ రోజు ఇందుమతి చీరకు నిప్పు అంటుకోవడంతో ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. మూడు రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత ఆమె మరణించారు. తరువాత చలపతిరావుని రెండో పెళ్లి చేసుకోమని కుటుంబసభ్యులు ఒత్తిడి చేసినా.. ఆయన మాత్రం ఆ పని చేయలేదు. పిల్లలను తనే పెంచి పెద్ద చేశారు.ఆయన కుమారుడు రవిబాబు డైరెక్టర్ గా, నటుడిగా రాణిస్తుండగా..
కూతుర్లు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఓ సమయంలో చలపతిరావుకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దాదాపు తొమ్మిది నెలల పాటు ఆయన వీల్ చైర్ లోనే ఉండిపోయారు. మరో సందర్భంలో మహిళలను ఉద్దేశించి ఆయనొక ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో చలపతిరావుని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. దాంతో ఆయనకు బాధ కలిగి సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకున్నారట.
అయితే కుమారుడు రవిబాబు దగ్గరుండి ఆయన్ను చూసుకొని విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పడంతో ఆయన సూసైడ్ ఆలోచనను మానుకున్నారట. చలపతిరావు చివరిగా ‘బంగార్రాజు’ సినిమాలో కనిపించారు. అలానే రవిబాబు తీసిన ఓ సినిమాలో చలపతిరావు కీలకపాత్ర పోషించారట. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.