Fahadh Faasil: ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసిన ఫహాద్ ఫాజిల్.. !

‘పార్టీ లేదా పుష్ప’ అనే డైలాగ్ వింటే ‘పుష్ప’ సినిమా గుర్తొచ్చేస్తుంది. ఆ డైలాగ్ చెప్పిన ఫహాద్ ఫాజిల్ గుర్తొస్తాడు. మలయాళ నటుడే అయినప్పటికీ తెలుగులో కూడా భీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఫహాద్ ఫాజిల్. ‘పుష్ప ‘(ది రైజ్) లో చివర్లో భన్వర్ సింగ్ షెకావత్ గా ఎంట్రీ ఇచ్చి హీరో అల్లు అర్జున్ ను సైతం డామినేట్ చేసేలా నటించాడు ఫహాద్ ఫాజిల్. ఫస్ట్ పార్ట్ లో అతను కనిపించేది కేవలం 20 నిమిషాలు మాత్రమే.

పార్ట్ 2 అయిన ‘పుష్ప 2’ (పుష్ప ది రూల్) లో మాత్రం ఇతని పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటుందట. అందులో పుష్ప ని ముప్పు తిప్పలు పెట్టేలా అతని పాత్ర ఉంటుందని వినికిడి. ఇదిలా ఉండగా.. ఫహాద్ ఫాజిల్ తాజాగా కొత్త కారు కొనుగోలు చేశాడు. ‘ల్యాండ్ రోవర్’ కి చెందిన ‘డిఫెండర్’ కారుని ఆమె కొనుగోలు చేసింది. దీని ధర రూ.2 .11 కోట్లు.

ఇప్పటికే ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) గ్యారేజీలో లంబోర్థిని ఉరస్, మినీ కంట్రీమ్యాన్, పోర్షే 911 కారెరా ఎస్ స్పోర్ట్స్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక ఫహాద్ సినిమాల విషయానికి వస్తే.. ‘పుష్ప 2 ‘ తో పాటు ఇంకా తమిళ, మలయాళ భాషల్లో అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. రజినీకాంత్ – అమితాబ్ కలిసి నటిస్తున్న సినిమాలో కూడా ఫహాద్ నటిస్తున్నట్టు సమాచారం.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus