టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా , విలన్ గా గుర్తింపు పొందిన నటుడు జగపతి బాబు. ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు పొందిన జగపతి బాబు నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గటంతో సినిమాలకు దూరం అయ్యాడు. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న జగపతిబాబు విలన్ గా కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు.
తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా జగపతిబాబుకి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక పుట్టినరోజు సందర్భంగా జగపతిబాబు ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన సినిమా విశేషాల గురించి వెల్లడించటమే కాకుండా కులాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రస్తుతం జగపతిబాబు కులాల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు కుల ప్రస్తావన తీసుకువస్తూ.. గతంలో తనకు ఎదురైన ఒక అనుభవం గురించి తెలియజేశాడు. ఈ క్రమంలో జగపతి బాబు మాట్లాడుతూ..”గతంలో విజయవాడ సిద్ధార్థ కాలేజ్ కి వెళ్లానని, ఆ సమయంలో కులానికి వ్యతిరేకంగా మాట్లాడతానని చెప్పినప్పుడు , అలాంటి పనులు చేయవద్దని ఆ కాలేజీ ప్రిన్సిపల్ వేడుకున్నారని అన్నారు.
ఎందుకు మాట్లాడవద్దు అని జగపతి బాబు అడిగితే.. కాలేజీ ఆడిటోరియంలో 2000 మంది ఉన్నారు, వాళ్లంతా కమ్మ కుల పిచ్చోళ్లు, మీరు కనుక కులానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తే మీకే ప్రమాదం అని ప్రిన్సిపల్ చెప్పినట్లు జగపతి బాబు వెల్లడించారు. ఇక ఆ రోజు ప్రిన్సిపల్ విజ్ఞప్తి మేరకు కులం ప్రస్తావన తీసుకురాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయానని జగపతి బాబు చెప్పుకొచ్చారు”. ఇలా కులం గురించి జగపతిబాబు చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.