నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 30వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబైలో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇంటర్వ్యూలలో భాగంగా ఈ మధ్యకాలంలో నాని ఏం మాట్లాడినా కూడా పెద్ద ఎత్తున వివాదంగా మారుతున్న విషయం మనకు తెలిసిందే.
అయితే తాజాగా ఈ వివాదాల గురించి నానీ (Nani) మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఈ మధ్యకాలంలో తాను ఏం మాట్లాడినా వివాదంగానే మారుస్తున్నారని తెలిపారు. తాను నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా సమయంలో కూడా టికెట్ల విషయంలో వివాదం సృష్టించారని ఈయన తెలిపారు. ఇక తాను సుకుమార్ గురించి పాజిటివ్ గా మాట్లాడిన కూడా అది కూడా వివాదంగానే మార్చారని నాని తెలిపారు. ఒక మీడియా ప్రతినిధి ఎంతో మంది స్టార్ డైరెక్టర్లతో పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే మీరెందుకు కొత్త డైరెక్టర్ తో ఈ సినిమా చేశారు అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు నాని సుకుమార్ గారిని ఉదాహరణగా చూపిస్తూ సుకుమార్ గారు ఇక్కడ స్టార్ డైరెక్టర్ అయితే ఇతర భాషలకు ఆయన ఎవరో తెలియదు. ఇలా పుష్ప సినిమా ద్వారా ఇతర భాషలలోకి ఆయన కొత్త డైరెక్టర్ గా పరిచయమయ్యారు. కొత్త డైరెక్టర్ గా పరిచయమైనప్పటికీ ఇతర భాషలలో పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.అలాగే శ్రీకాంత్ కూడా కొత్త డైరెక్టర్ అయితే సినిమా విడుదలై మంచి సక్సెస్ అయిన తర్వాత తనకు మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా నాని ఉదాహరణగా చెప్పారు.
అయితే కొందరు మాత్రం ఈ విషయాన్ని పెద్ద ఎత్తున వివాదం చేసి మాట్లాడారని ఈ సందర్భంగా నాని చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా ద్వారా నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటారో తెలియాల్సి ఉంది.