Naresh, Pavitra Lokesh: పవిత్రా లోకేష్ తో రిలేషన్.. స్పందించిన నరేష్!

కొన్నాళ్లుగా సీనియర్ నటుడు నరేష్.. పవిత్రా లోకేష్ తో రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారంటూ కన్నడ మీడియా వార్తలను ప్రచురించింది. ఈ వార్తలపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి స్పందిస్తూ.. నరేష్ తో తన సంబంధాలు ఇంకా తెగిపోలేదని.. తాను ఇంకా విడాకుల పేపర్లపై సంతకం చేయలేదని చెప్పుకొచ్చింది. నరేష్ తన భర్త అని చెప్పుకోవడంలో తప్పు లేదని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై నరేష్ స్పందిస్తూ.. ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. రమ్య రఘుపతి తన భార్యగా ఎప్పుడూ ప్రవర్తించలేదని అన్నారు. ఆమెకి ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. తనకు ఎమోషనల్ సపోర్ట్ కావలసినప్పుడు పవిత్రా లోకేష్ అండగా ఉన్నారని.. ఆమె తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు నరేష్. ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా సమయంలో పవిత్రా లోకేష్ ను కలిశానని.. ‘సమ్మోహనం’ సినిమా సమయంలో కనెక్ట్ అయ్యామని అన్నారు.

తనకు నా బాధలు చెప్పుకున్నానని.. ఆమె కూడా తన బాధలు చెప్పుకుందని.. ఆ విధంగా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామని అన్నారు. తను నా ఫ్యామిలీ ఫ్రెండ్ అని.. అందరూ అనుకుంటున్నట్లుగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో తను ఉంటుందని.. మరి రమ్య రఘుపతి ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. అమ్మే ఎక్కడ ఎవరితో ఉందో చెప్పాలనుకోవడం లేదని.. ఆమెకి విడాకులు ఇవ్వడానికి కారణం పవిత్రా లోకేష్ కాదని అన్నారు.

కావాలనే ఆమె పవిత్రాను మధ్యలోకి లాగుతుందని.. అదొక ప్లాన్ అని.. మంచి బంధాన్ని విడగొట్టాలనుకుంటుందని అన్నారు. తనను దారుణంగా బద్నాం చేయడానికే ఆమె ఇలా చేస్తుందని అన్నారు. ఇక కన్నడ ఛానెల్ ఒకటి పవిత్రా స్ట్రింగ్ ఆపరేషన్ చేయడంపై స్పందించిన నరేష్ ఫైర్ అయ్యారు. మీడియా అనేది ప్రజల కష్టాల గురించి, వారికి పనికొచ్చే విషయాలపై స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయాలి కానీ ఇలా ఒకటి వ్యక్తిగత జీవితంపై కాదని అన్నారు. నరేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus