ఇప్పటి డైరెక్టర్లపై సీనియర్ యాక్టర్ నరేష్ కామెంట్స్ వైరల్..!

  • June 9, 2022 / 01:17 PM IST

సీనియర్ యాక్టర్ నరేష్ మాట్లాడే తీరు పై అనేక నెగిటివ్ కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. అతని డ్రెస్సింగ్ స్టైల్ వంటి వాటి పై కూడా చాలా సెటైర్లు మీమ్స్ వస్తుంటాయి. సాయి తేజ్.. కు బైక్ యాక్సిడెంట్ జరిగిన టైంలో కానీ అంతకు ముందు ‘మా’ కి సంబంధించిన మీటింగ్ లలో కానీ ఈయన చేసిన కామెంట్స్ అనేక వివాదాలకు దారి తీశాయి. ఇప్పుడు సైలెంట్ గా ఈయన యంగ్ డైరెక్టర్లకి కూడా చురకలు అంటించారు. విషయం ఏంటి అంటే..

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంటే సుందరానికీ`చిత్రంలో ఈయన ఫాదర్ రోల్ ప్లే చేశారు. జూన్ 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా కామెడీ సినిమాల గురించి ఈయన మాట్లాడుతూ.. “గతంలో కామెడీ సినిమాలు జంథ్యాల‌, వంశీ, రేలంగి న‌ర‌సింహారావు వంటి దర్శకులు చేసేవారు. ఇప్పటి దర్శకులు ఆడియ‌న్స్ ప‌ల్స్ బ‌ట్టి కామెడీ సినిమాలు తీస్తున్నారు.

అప్ప‌ట్లో తెలుగు సినిమాకు ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు ఒక్క‌రే ఉండేవారు. అందువల్ల మంచి సినిమాలు వ‌చ్చేవి. ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత వేరు వేరు అయితే స‌రిగ్గా తీయ‌డం క‌ష్టం.ఇప్పుడు అలాగే జరుగుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ పాత రోజులు మాదిరే ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు ఒక్క‌రే అయ్యేలా యంగ్ ద‌ర్శ‌కులు రావ‌డం అనేది ఆనందం కలిగించే విషయం. కామెడీ సినిమాలు రాయ‌డం క‌ష్టం. తీయ‌డం మ‌రీ క‌ష్టం. న‌టీన‌టులు కుద‌ర‌డం మ‌రింత క‌ష్టం” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ” ‘అంటే సుందరానికి’ చిత్రంలో అన్ని భాష‌ల న‌టీన‌టులున్నారు. వారంతా టైమింగ్ ఉన్న వారే. నా మ‌ద‌ర్‌ గా భిక్షు గారి భార్య న‌టించింది. త‌ను బాగా న‌టించింది. ఏది ఏమైనా ఒక సినిమా హిట్ అయితే వ‌ర‌స‌గా కొద్దికాలం అవే వ‌స్తుంటాయి. మారుతీ ద‌ర్శ‌క‌త్వం లో ప్రేమ‌క‌థా చిత్రం వ‌చ్చాక.. తర్వాత హార‌ర్ కామెడీ సినిమాలు ఎక్కువగా వచ్చాయి. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ ఇలాంటి సినిమాలే ఎక్కువగా వస్తాయి” నరేష్ కామెంట్స్ చేశారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus