Actor Naresh, Srikanth: సాయి తేజ్ యాక్సిడెంట్.. ‘మా’ కలహాల వరకు ఎందుకు..!

గత శుక్రవారం నాడు మెగా మేనల్లుడు సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ వల్ల గాయపడ్డాడు.‏మాదాపూర్‏లోని కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా..ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో అతన్ని వెంటనే జూబ్లీ హిల్స్‏లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.అతనికి కాలర్ బోన్ సర్జరీ అవ్వడం జరిగింది.అయితే సాయి తేజ్ కు ఇలాంటి ప్రమాదం జరగడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు అతను కోలుకోవాలని వీడియో బైట్లు పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో..సీనియర్ నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అతని పై చాల మంది ప్రముఖులు ఈ విషయంలో మందలించడం జరిగింది.

ఆ లిస్ట్ లో హీరో శ్రీకాంత్ కూడా ఉన్నాడు. అలా అని శ్రీకాంత్… నరేష్ పై విమర్శలు గుప్పించలేదు. వీడియో బైట్లు పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకుని పెడితే ఫ్యాన్స్ కంగారు పడకుండా ఉంటారు అని అతను కూల్ గా చెప్పాడు.అయితే నరేష్ అందరి కామెంట్స్ ను పక్కన పెట్టి శ్రీకాంత్ వ్యాఖ్యల పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. “శ్రీకాంత్.. నా బైట్ మీద నువ్వు ఇచ్చిన బైట్ చూశాను. అలా ఇచ్చావేంటమ్మా… ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్.. స్పీడ్‏లో లేడు. బురదలో జారి పడ్డాడు. నేను మాట్లాడింది.. మీడియాకి వేరే విధంగా వెళ్లి ఉంటాయి. ఇండస్ట్రీలో చాల మంది పెద్దలు నాకు ఫోన్ చేసి అడిగారు నేను వాటిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. బైట్ ఇచ్చేముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎమోషన్స్ చాలా ముఖ్యం. చనిపోయినవారి గురించి నేను చెప్పలేదు. జనరల్ గా ఇండస్ట్రీలో జరిగన కొన్ని సంఘటనల గురించి చెప్పాను.

బైకులను మనం చాక్లెట్స్ లా పిల్లలకు ఇవ్వము. యాక్సిడెంట్స్ అనేవి కామన్… నాకు కూడా జరిగాయి. కానీ నువ్వు మాట్లాడిన విధానం బాధకలిగింది. నా కళ్ల ముందు నువ్వు హీరోగా రావడం చూశాను. మంచి సినిమాలు చేశావు. హీరోగా ఎదిగావు. మా ఎలక్షన్స్‏లో పోటీ చేశావు.నా ప్యానెల్ ముందు ఓడిపోయావు. దయచేసి ఇలా ఇంకోసారి బైట్స్ ఇవ్వొద్దు. నా బైట్స్‎కు ప్రజలు వేరే విధంగా రియాక్ట్ అవుతున్నారు. గత 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడు బైట్స్ ఇవ్వడంలో కాంట్రావర్సి, పొలిటికల్, చెడ్డ పేరు వంటివి లేవు. కానీ నువ్వు బైట్స్ ఇచ్చే ముందు ఆలోచించి, పెద్దవారితో మాట్లాడి ఇవ్వు” అంటూ ఘాటుగా చెప్పుకొచ్చారు నరేష్. అయితే ఇక్కడ నరేష్ అనవసరంగా ‘మా’ ను అనవసరంగా లాగారంటూ కొంతమంది అతన్ని తప్పు పడుతుండడం విశేషం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus