Naresh: మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై నరేష్ కి సూటి ప్రశ్న వేసిన రిపోర్టర్.. నరేష్ సమాధానం ఏంటంటే?

నరేష్ పవిత్రల వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్న మనకు తెలిసిందే నటుడు నరేష్ ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ తన ముగ్గురు భార్యలకు దూరంగా ఉండటమే కాకుండా మరొకటి పవిత్ర లోకేష్ కు దగ్గరయ్యారు ఇలా వీరిద్దరూ ప్రస్తుతం రిలేషన్లో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి నరేష్ పవిత్ర లోకేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారారు.ఇక నరేష్ పవిత్ర లోకేష్ జంటగా తాజాగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత నరేష్ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే యాంకర్ నరేష్ ను ప్రశ్నిస్తూ ఇప్పటివరకు మీరు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.అయితే ముగ్గురు భార్యలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం పవిత్ర గారితో రిలేషన్ లో ఉంటున్నారు.

వీరంతా కూడా మిమ్మల్ని చూసి వచ్చారా లేకపోతే మీ ఆస్తిని చూసి వచ్చారా అంటూ నరేష్ ను సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నరేష్ సైతం ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా నరేష్ స్పందిస్తూ.. నాకు ఆస్తి లేనప్పుడు వెళ్లిపోయినవాళ్లు ఉన్నారు, ఆస్తి కోసం వచ్చిన వాళ్లూ ఉన్నారు. ఇవన్నీ చూసిన పుస్తకమే నేనంటూ నరేష్ అన్నారు. వ్యామోహానికి, ప్రేమకు చాలా తేడా ఉంది. ఈ రెండిటినీ ఏనాడో చూసేశాను.

కానీ, నాకు పవిత్రలో నచ్చింది మాత్రం నిస్వార్ధంగా ఉండడం అని (Naresh) నరేష్ వివరించారు.ఇలా ఇదివరకు పెళ్లి చేసుకున్న వారందరూ కూడా తన డబ్బు ఆస్తి చూసి వచ్చారని పవిత్ర మాత్రం తన ఆస్తిని చూసి ఏమాత్రం ఆశపడలేదు అంటూ నరేష్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus