Actor Naresh: రమ్య రఘుపతికి రూ.10 లక్షలు ఇచ్చానన్న సీనియర్ నరేష్!

ఈ మధ్య కాలంలో సీనియర్ నరేష్ పవిత్ర లొకేష్ మ్యారేజ్ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పవిత్ర లోకేశ్ ఒక టీవీ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ లో భాగంగా మాట్లాడుతూ నరేష్ ను తాను పెళ్లి చేసుకోబోతున్నానని జరిగిన ప్రచారం నిజమేనని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియాతో మాట్లాడుతూ నరేష్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

సీనియర్ నరేష్ కు తాను విడాకులు ఇవ్వనని రమ్య రఘుపతి కామెంట్లు చేశారు. సీనియర్ నరేష్ నన్ను బెదిరించారని రమ్య చెప్పగా ఆ మాటలు చర్చనీయాంశం అయ్యాయి. అయితే రమ్య రఘుపతి చేసిన కామెంట్ల గురించి సీనియర్ నరేష్ రియాక్ట్ అయ్యారు. రమ్య రఘుపతి డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ కు దిగిందని హైదరాబాద్ లో ఈ విధంగా చేసి ప్రస్తుతం బెంగళూరులో బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టిందని నరేష్ అన్నారు.

తాను సినిమాలలో 100 కంటే ఎక్కువమంది హీరోయిన్లతో కలిసి నటించానని కానీ ఎవరైనా నేను చీట్ చేశానని చెప్పగలరా అంటూ నరేష్ ప్రశ్నించారు. నా పెళ్లి ఫైల్ అయింది కాబట్టి పెళ్లి గురించి వార్తలు రాయొచ్చని పాలిటిక్స్, మూవీస్, సామాజిక సేవతో తాను బిజీ అయ్యానని ఆయన అన్నారు. రమ్య రఘుపతి వల్ల నా కుటుంబం నాశనం అయిందని నరేష్ కామెంట్లు చేశారు.

పర్సనల్ రీజన్స్ వల్ల నాతో ఉన్నవాల్లు నా నుంచి విడిపోయారని నరేష్ తెలిపారు. కృష్ణగారి నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేయాలని రమ్య ప్రయత్నించిందని ఆయన అన్నారు. ఆమె నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో నేను 10 లక్షల రూపాయలు ఇచ్చానని నరేష్ తెలిపారు. జైలుకు పోతానని చెప్పి రమ్య బాధపడితే నేను ఆ డబ్బులు ఇచ్చానని ఆయన తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత రమ్య ఇప్పుడు ఈ విధంగా బిహేవ్ చేస్తోందని నరేష్ చెప్పుకొచ్చారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus