చిత్ర పరిశ్రమ ఎప్పుడు ఎవరిని స్టార్ ను చేస్తుందో కచ్చితంగా చెప్పలేము. ఇక్కడ రాణించడానికి బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోతుంది అనుకోవడానికి లేదు.. అలా అనుకుంటే అల్లు శిరీష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి వాళ్ళు పెద్ద స్టార్లు అయిపోవాలి. కానీ రవితేజ,విజయ్ దేవరకొండ వంటి వాళ్ళే ఎందుకు రాణిస్తున్నారు? పోనీ గ్లామర్, ట్యాలెంట్ ఉంటే సరిపోతుంది అనుకుందాం..! అలా అనుకుంటే చాలా మంది హీరోలు ఇంకా నిలబడలేకపోతున్నారు. సో ఇక్కడ నిలదొక్కుకోవాలన్నా..
స్టార్ గా ఎదగాలి అన్నా టైం కలిసి రావాలి. దీనికి ఉదాహరణగా నేచురల్ స్టార్ నాని మరియు ‘కార్తీక దీపం’ ఫేమ్ నిరుపమ్ లను చెప్పుకోవాలి. అసలు వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటి అనుకుంటున్నారా..?నిజానికి నాని పెద్ద స్టార్ అవ్వడానికి మన డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ కారణమట. విషయంలోకి వెళితే.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో ‘అష్టా చమ్మా’ అనే చిత్రంలో హీరో పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు నిరుపమ్ కూడా వెళ్ళాల్సి ఉందట.
అసలు నానిని ఆ సినిమాకి హీరోగా అనుకొనేలేదట దర్శకుడు. కానీ ఏం జరిగిందో ఏమో తెలీదు.. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చెయ్యాల్సిన నానిని హీరోగా ఫైనల్ చేసేసారట. కట్ చేస్తే నాని ఇప్పుడు రూ.8 కోట్లు పారితోషికం తీసుకునే స్టార్ హీరో అయిపోవడం.. నిరుపమ్ మాత్రం సీరియల్ స్టార్ గా మిగిలిపోవడం జరిగిందని తెలుస్తుంది.ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా నిరుపమ్ తెలియజేసాడు.