ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీల మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సౌత్ తోనే కాకుండా నార్త్ కు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వంటి వారు మరణిస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. అయితే ఇందులో కొంతమంది బలవన్మరణానికి పాల్పడడం షాకిచ్చే అంశం. ఇందులో సినిమా వాళ్ళే కాకుండా వాళ్ళ కోసం పనిచేసే ఫ్యాషన్ డిజైనర్లు వంటి వారు కూడా కూడా ఉన్నారు. ఈ మధ్యనే నందమూరి ఫ్యామిలీకి చెందిన కంటమనేని ఉమామహేశ్వరి గారు సూసైడ్ చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే.
అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి వల్ల ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు పోస్ట్ మార్టం లో తేలింది అలాగే ఆమె కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి.. వాళ్ళు ఎలా స్ట్రెస్ ని, ప్రెజర్ ను హ్యాండిల్ చేయగలరు.. అంటూ చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా… తాజాగా మరో నటుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. డిప్రెషన్‌కు గురై.. డ్రగ్స్‌కు బానిసై…, ఆ మైకంలో పదునైన ఆయుధంతో చెయ్యి కోసుకున్నాడు. ఈ సంఘటనను అతను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టడం షాకిచ్చే అంశం.
విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని ఆస్పత్రిలో తరలించారు. ఆ నటుడు సైబాల్ భట్టాచార్య అని తెలుస్తుంది.ఇతను బెంగాలీ నటుడు. సోమవారం నాడు తన నివాసంలో అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అవకాశాలు లేకపోవడం, దాంతో ఆదాయం ఏమీ రాకపోవడంతో అతను ఇలా డిప్రెషన్ కు గురైనట్టు తెలుస్తుంది. కోల్‌కతాలోని తన నివాసంలోనే అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ‘నాకు మరో దారి కనిపించడం లేదు. నా భార్య, అత్తమ్మ..’ అంటూ ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ వీడియో ఆగిపోయింది. భట్టాచార్య తన చేతిలో ఉన్న కత్తితో తన తల, కాళ్లను గాయపర్చుకున్నట్లు స్పష్టమవుతుంది.