నటుడు సుహాస్ రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. వైరల్..!

‘మజిలీ’ ‘డియర్ కామ్రేడ్’ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ‘ప్రతీ రోజూ పండగే’ వంటి చిత్రాల్లో హీరో ఫ్రెండ్ గా నటించి ప్రేక్షకులను అలరించాడు సుహాస్. ఇటీవల ఓటిటిలో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రంలో కూడా తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు సుహాస్. త్వరలో ‘కలర్ ఫోటో’ అనే చిత్రంతో హీరోగా కూడా మారబోతున్నాడు. ఆ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుహాస్ తన ప్రేమకథను వర్ణిస్తూ.. “తను.. డిగ్రీలో నా క్లాస్ మేట్.! 2009 నుండీ మేము.. ఒకర్నొకరం బాగా ఇష్టపడ్డాం. మా ఇద్దరిది ప్రేమే అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాం.

మా చుట్టూ జరుగుతున్న ప్రేమ కథల్ని చూసేవాళ్లం. ఎవరైనా ప్రపోజ్ చేసినా.. బ్రేకప్ అయిపోవడం.. ఇలాంటివి చూసేవాళ్లం. వాళ్లని చూసి ప్రేమించడం ఎందుకు విడిపోవడం ఎందుకు? అని అనిపించేది. ఒకసారి ప్రేమించాం అంటే ఒకర్నొకరు కనెక్ట్ అయితేనే కదా.. మరి విడిపోవడం ఎందుకు వస్తుంది.. అని ఆలోచించేవాళ్లం. అయితే సినిమాల్లోకి వచ్చిన తరువాత మన మైండ్ సెట్ మారే అవకాశం చాలానే ఉంటుంది. చుట్టూ రకరకాల అమ్మాయిలు ఉంటారు.. కొత్తగా ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. కానీ.. నేను సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా తన గురించే ఆలోచించేవాడిని. ఫస్ట్ నుంచి తనే నాకు హెల్ప్ చేసింది. తను జాబ్ చేస్తూ.. మా ఇంట్లో ఒప్పించి నన్ను ఫైనాన్సియల్‌గా ఆదుకుంది. మెంటల్‌గా తను చాలా స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల నేను కెరియర్ గురించి ఆలోచించగలిగాను.నేను ఏం చేసినా.. ‘నువ్ కుమ్మెయ్.. నీ వెనుక నేను ఉన్నాను.. మన లైఫ్ చాలా బాగుంటుంది.. కాస్త లేట్ అవుతుంది అంతే’ అంటూ ధైర్యం చెప్పేది. తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు ఉన్నా.. ఇంకా పెళ్లి చేసుకోవా అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినా.. అవేం నా దగ్గరకు ప్రస్తావించేది కాదు.

వాటిని చెప్తే నేను డల్ అవుతానని ఆలోచించేది. తన లోపల భయపడేది. తను ఒక్కగానొక్క కూతురు.. పెళ్లి చేసుకోకుండా వాడి కోసం ఎందుకు అలా ఉంటుంది? అని అనుకునేవాళ్లు. మా ఇంట్లో కూడా తిట్టేవారు. అయితే ధైర్యం చేసి వాళ్ల పేరెంట్స్ ఇక మేం ఒంటరిగా ఉండాలని అనుకోవడం లేదు.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం.. అని చెప్పగానే.. మేం పెళ్లికి రాము.. మీరైతే వెళ్లి చేసుకోండి అని నాతో పంపించేశారు. ఒక్కర్తే కూతురు.. పైగా నాకు ఉద్యోగం కూడా లేదు.. అందుకే ఆలోచించారు. కానీ మేం పెళ్లి చేసుకోవాలని ఆరోజు ఉదయం డిసైడ్ అయ్యాం.. మధ్యాహ్నం చిన్న తిరుపతి వెళ్లి అక్కడ పెళ్లి చేసేసుకున్నాం. ఇప్పుడు వాళ్ల ఇంట్లో అలాగే మా ఇంట్లో కూడా పరిస్థితి సెట్ అయ్యింది. ఇప్పుడు మేము హ్యపీ” అంటూ చెప్పుచ్చాడు.


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus