ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని ప్రకాష్ రాజ్ ప్రకటించిన వెంటనే ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని కొంతమంది సినీ ప్రముఖులు కామెంట్లు చేశారు. అయితే తాజాగా ఒక కార్యక్రమానికి ముఖ్య నటుడిగా హాజరైన సుమన్ మాట్లాడుతూ మన దేశంలో పుట్టిన పౌరులంతా లోకలేనని కామెంట్లు చేశారు. అందరూ కలిసి కట్టుగా ఉండాలని సుమన్ సూచనలు చేశారు. లోకల్, నాన్ లోకల్ గురించి ప్రస్తావించడం అర్థ రహితమని సుమన్ పేర్కొన్నారు.
రైతులు, వైద్యులు కూడా నాన్ లోకల్ అని భావిస్తే అని భావిస్తే ప్రజలకు ఆహారం, వైద్యం అందదని సుమన్ వెల్లడించారు. పరోక్షంగా మా ఎన్నికల గురించి ప్రస్తావించిన సుమన్ నాన్ లోకల్ గురించి కామెంట్లు చేయడంతో ఆయన ప్రకాష్ రాజ్ కు మద్దతు ప్రకటించారని అర్థమవుతోంది. మరోవైపు ‘మా’ ఎన్నికలు పొలిటికల్ ఎలక్షన్స్ ను తలపిస్తున్నాయి. గత ఎన్నికలకు భిన్నంగా మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నారు.
ఎన్నికలు జరిగే సమయానికి ఒకరిద్దరు సభ్యులు పోటీ నుంచి తప్పుకుని వేరేవాళ్లకు మద్దతు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. చిరంజీవి ప్రత్యక్షంగా ఎవరికి మద్దతు ఇస్తారో వారే ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఏకగ్రీవం ప్రతిపాదన ఉన్నా పోటీ చేసే సభ్యులు అందుకు అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నట్టు తెలుస్తోంది.