Suman: ఆధ్యాత్మిక పాత్రలలో అవకాశం రావాలంటే దేవుడి పర్మిషన్ ఉండాలి: సుమన్

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా సహాయ నటుడిగా ఎన్నో చిత్రాలలో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సీనియర్ నటుడు సుమన్ గురించి అందరికీ సుపరిచితమే.ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవితో పోటీగా సినిమాలలో నటించిన సుమన్ కొన్ని కారణాలవల్ల తన సినీ కెరియర్ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంది. ఇలా అప్పటినుంచి ఈయనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఇక పలు సినిమాలలో సహాయ నటుడి పాత్రలలో నటిస్తూ సుమన్ సందడి చేస్తున్నారు. ఇక తాజాగా జయహో రామానుజ అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమన్ సినిమాల గురించి తన పాత్రల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఇక సుమన్ పలు సినిమాలలో ఆధ్యాత్మిక పాత్రలలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పాత్రల గురించి మాట్లాడుతూ డబ్బులు పలుకుబడి ఉంటే ఆధ్యాత్మిక పాత్రలలో నటించే అవకాశాలు రావని ఈయన తెలిపారు.ఇలాంటి పాత్రలలో నటించాలి అంటే దేవుడు పర్మిషన్ కూడా తప్పనిసరిగా అవసరమని సుమన్ తెలిపారు.

ఈ క్రమంలోనే అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించడానికి చాలామందిని సంప్రదించారు. అయితే వాళ్ళు ఎవరు కూడా ఈ పాత్రలో నటించడానికి సెట్ కాలేదు.వెంకటేశ్వర స్వామి పాత్రలో నేను నటించాలని ఆ భగవంతుడు కోరుకున్నాడు కనుక ఆయన ఆశీర్వాదం వల్లే తాను ఆ పాత్రలో నటించానని ఈ సందర్భంగా ఆధ్యాత్మిక పాత్రల గురించి సుమన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags