Ananya Panday, Vijay Devarakonda: విజయ్ ని అంత మాట అనేసిందేంటి..?
- February 20, 2022 / 05:47 PM ISTByFilmy Focus
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. అలాంటి హీరోపై నటి అనన్య పాండే చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘లైగర్’ కోస్టార్ గా విజయ్ ని దగ్గరగా పరిశీలించిన అనన్య.. విజయ్ తెరపై కనిపించేదానికి బయట పూర్తి భిన్నంగా ఉంటాడని తెలిపింది. అంతేకాదు.. విజయ్ పిరికివాడు అంటూ చెప్పుకొచ్చింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్యను విజయ్ దేవరకొండతో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ప్రశ్నించగా.. నిజజీవితంలో అతడు చాలా డిఫరెంట్ గా ఉంటాడని చెప్పుకొచ్చింది. అతడు నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూశానని.. ఆ సినిమా చాలా నచ్చిందని చెప్పింది. నిజానికి అతడు పోషించే పాత్రలకు చాలా భిన్నంగా ఉంటాడని తెలిపింది. విజయ్ పిరికివాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

సహజనటుడిగానే కాకుండా.. సెట్స్ లో తనను సౌకర్యంగా ఉంచినందుకు అతనికి కృతజ్ఞతలు చెప్పింది. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తోన్న ‘లైగర్’ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక అనన్య పాండే విషయానికొస్తే.. ఇటీవల ఆమె నటించిన ‘గెహ్రయియా’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇందులో దీపికా పదుకోన్, సిద్ధాంత్ చతుర్వేది లాంటి తారలు నటించారు. శకున్ బాత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే చాలా మంది ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. ఇందులో అనన్య పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.
భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!















