చైనా తర్వాత ఇండియా అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉండేది.కానీ కోవిడ్ కారణంగా ఇండియా జనాభా.. చైనాని మించిపోయినట్టు కూడా మొన్నామధ్య వార్తలు వచ్చాయి. మన ఇండియాలో ‘వన్ ఆర్ నన్’ అనే సిస్టం ఉంది కాబట్టి.. ఇంకా పర్వాలేదు అని అంతా అనుకోవచ్చు. ఈరోజుల్లో ఒకరిని కనీ పెంచడానికి మధ్య తరగతి జనాలకు జీవితం అయిపోతుంది. కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం పోషించే స్థోమత ఉన్నా లేకుండా డజన్ల కొద్దీ పిల్లలను కంటూనే ఉన్నారు. వాళ్ళను సరైన దారిలో పెట్టే తీరిక లేక రోడ్లపై ఇష్టమొచ్చినట్టు వదిలేస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం.
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం మరీ దీనికి దగ్గరగా కాదు కానీ కొంచెం సిమిలర్ గా ఉంటుంది. జస్ట్ ‘బదాయ్ హో’ సినిమాలా అనమాట. హీరో తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుదామని వస్తే… అతని తల్లి గర్భవతి అవుతుంది. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అమెరికా వంటి దేశాల్లో ఇంకా ఆ పద్ధతి ఉంది. మన దగ్గర కొన్ని కొన్ని ఏరియాల్లో అలాంటి పద్ధతి ఉంది. తాజాగా ఓ హీరోయిన్ తల్లి తన 47 వ ఏట ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన కేరళలో చోటు చేసుకుంది.
‘చెంబట్టు’ ‘ఇలయవళ్ గాయత్రి’ వంటి సీరియల్స్ లో నటించి ఈమె బాగా పాపులర్ అయ్యింది. పలు సినిమాల్లో కూడా నటిస్తుంది. తాజాగా ఆమె తల్లి ఓ ఆడపిల్లకి జన్మనిచ్చినట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది. ఆర్య పార్వతి వయసు 23 ఏళ్లు కాగా ఆమె తల్లి వయసు 47 ఏళ్లు. లేటు వయసులో ఆమె తల్లి బిడ్డకు జన్మనివ్వడం ఏంటి అంటూ అంతా నోరెళ్లబెడుతున్నారు . ‘తన చెల్లిలిని ఎత్తుకున్నందుకు ఆనందంగా ఉంది’ ఆమె సోషల్ మీడియాలో పేర్కొంది. అందుకు సంబంధించిన ఫోటో వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.