Hansika: హన్సిక మ్యారేజ్ వీడియో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

తెలుగులో ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే తన వ్యాపార భాగస్వామి సోహైల్ ని వివాహం చేసుకుంది. సెలబ్రిటీల పెళ్లి వీడియోలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తమ పెళ్లిని ఒక డాక్యూమెంటరీ తరహాలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఇలా చేయడం వలన కోట్లలో ఆదాయం కూడా వస్తుంది. ఇప్పటికే దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి వీడియో హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థకు అమ్మేశారు. ఇప్పుడు హన్సిక, సోహైల్ ల పెళ్లికి సంబంధించిన వీడియోను హాట్ స్టార్ సంస్థ స్ట్రీమింగ్ చేయబోతుంది. ‘లవ్ షాదీ డ్రామా’ అనే టైటిల్ తో హన్సిక పెళ్లి వీడియోను ఒక డాక్యుమెంటరీ తరహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. డాక్యుమెంటరీ అంటే రెగ్యులర్ గా కాకుండా..

ఆకట్టుకునే పెళ్లి హడావిడి అలానే కొంత డ్రామా, మరికొంత ఎంటర్టైన్మెంట్ ను ఈ వీడియోలో హాట్ స్టార్ వారు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. దానికి తగ్గట్లుగా టైటిల్ పెట్టుకున్నారు. హన్సికకు ఉన్న క్రేజ్ కారణంగా భారీ మొత్తం పెట్టి హాట్ స్టార్ సంస్థ పెళ్లి హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే విధంగా హన్సిక ‘లవ్ షాదీ డ్రామా ‘ ఉంటుందని హాట్ స్టార్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. త్వరలోనే పూర్తి వీడియోను స్ట్రీమింగ్ చేయనున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus