టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో హేమ (Hema) ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ప్రశంసలు అందుకున్నారు. ఆమె సినీ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉండగా సుదీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించిన నటీమణులలో ఆమె కూడా ఒకరు కావడం గమనార్హం. అయితే సినిమా కెరీర్ పరంగా ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోని హేమ డ్రగ్స్ కేసు ద్వారా వార్తల్లో నిలిచారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ ను దాఖలు చేయడం జరిగింది.
Hema Bengaluru Rave Party Case:
అయితే ఈ ఛార్జ్ షీట్ లో హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు నివేదికలో పేర్కొన్నారని ఆమెకు సంబంధించిన ఎం.డీ.ఎం.ఏ మెడికల్ రిపోర్ట్ ను సైతం జత చేశారని భోగట్టా. ఈ కేసులో నిర్వాహకులు 9 మంది అని డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులు 39 మంది అని పోలీసులు నివేదికలో పేర్కొన్నారని తెలుస్తోంది.
అయితే తన పేరు మరోసారి వార్తల్లో నిలిచిన నేపథ్యంలో హేమ మాత్రం ఛార్జ్ షీట్ లో నా పేరు ఉన్నట్టు తెలిసిందని నేను అసలు శాంపిల్స్ ఇవ్వలేదని డ్రగ్స్ తీసుకోలేదని నేను డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే దేనికైనా సిధ్దమని ఆమె అన్నారు. పోలీసుల వెర్షన్ ఒక విధంగా ఉంటే హేమ వెర్షన్ మరో విధంగా ఉండటం గమనార్హం. హేమ గతంలో రెండు వారాల పాటు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.
బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు హేమకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గతంలో హేమను సస్పెండ్ చేయగా తాజాగా ఆ సస్పెన్షన్ ను ఎత్తేసిన సంగతి తెలిసిందే. హేమ వివాదం రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. హేమ ఈ వివాదం నుంచి బయటపడాలని ఆమె అభిమానులు భావిస్తున్నారు.