Actress Kasthuri Arrested: హైదరాబాద్ లో అరెస్ట్ అయిన కస్తూరి!

నటి కస్తూరి (Kasthuri) అరెస్ట్ అయ్యింది..కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆమెను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కస్తూరి అరెస్ట్ అవడం జరిగింది. ఇటీవల జరిగిన పొలిటికల్ ఈవెంట్లో కస్తూరి (Kasthuri).. తెలుగు వారి మనోభావాలు దెబ్బతినేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ‘ఎప్పుడో కొన్నేళ్ల క్రితం రాణుల దగ్గర సేవలు చేసేందుకు వచ్చి ఇక్కడ స్థిరపడి తమిళులుగా చలామణి అవుతున్నారు కొందరు. అంతఃపురంలో ఊడిగం చేసేందుకు వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు’ అంటూ కస్తూరి(Kasthuri) చేసిన కామెంట్స్‌ వివాదాస్పదమయ్యాయి.

Kasthuri Arrested

సోషల్ మీడియాలో ఆమె కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ నెటిజన్లు విమర్శలు కురిపించారు. తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చి సంజాయిషీ చెప్పినా ఆమె పై విమర్శలు ఆగలేదు. తెలుగు సంఘాలు కూడా ఆమె పై తీవ్రంగా మండిపడుతూ కేసులు పెట్టారు. దీంతో కస్తూరి (Kasthuri) భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అయితే చెన్నై పోలీసులు .. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల సాయంతో కస్తూరి(Kasthuri) గచ్చి బౌలి ఉందని తెలుసుకుని ఆమెను నిన్న అంటే నవంబర్ 16 న అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అటు నుండి అటే ఆమెను చెన్నై తరలించినట్టు తెలుస్తుంది.

ఇక పలు సినిమాల్లో హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన కస్తూరి(Kasthuri) గృహలక్ష్మి సీరియల్ తో తెలుగువారికి మరింత దగ్గరయ్యింది. దీంతో ఆమెకు ఇక్కడి సినిమాల్లో వెబ్ సిరీస్లలో వరుసగా ఛాన్స్..లు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో, మీడియాలో చేసే నెగిటివ్ కామెంట్లు.. ఆమెకు ఇలాంటి చిక్కులు తెచ్చి పెడతాయి.

నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, నీ అభిమానుల ముందు నటించకు: నయనతార

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus