Nayanthara vs Dhanush: నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, నీ అభిమానుల ముందు నటించకు: నయనతార

ప్రస్తుత తరంలో సినిమా ఇండస్ట్రీలో హీరోలతో సమానమైన స్టార్ డమ్ ను దక్కించుకున్న ఏకైక హీరోయిన్ నయనతార (Nayanthara) అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఆమెను చూసే నిర్మాతలు డబ్బులు పెడుతుండగా, ప్రేక్షకులు థియేటర్ల ముందు బార్లు తీరుతున్నారు. అందుకే ఆమె ధైర్యంగా ఎవరికీ తలవంచకుండా దూసుకుపోతుంటుంది. అందుకు తాజా నిదర్శనం ఆమె ధనుష్ కు (Dhanush)  రాసిన ఓపెన్ లెటర్. నయనతార-విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)  ల పెళ్లి కార్యక్రమాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థకు నయనతార భారీ మొత్తానికి ముట్టజెప్పిన విషయం తెలిసిందే. ఇటీవలే ట్రైలర్ ను కూడా విడుదల చేసారు.

Nayanthara

అయితే.. ఆ ట్రైలర్ లో నయనతార (Nayanthara) నటించిన “నానుమ్ రౌడీదాన్” (తెలుగులో “నేనూ రౌడీనే”) సినిమాలోని మ్యూజిక్ & ఫుటేజీని వాడుకున్నారు. దాంతో ఆ సినిమా నిర్మాత ధనుష్ ఏకంగా 10 కోట్ల రూపాయల దావా వేశాడు. ఆ విషయమై ధనుష్ తో మాట్లాడడానికి నయనతార & విఘ్నేష్ శివన్ ఎంత ప్రయత్నించినా కనీసం రెస్పాండ్ అవ్వలేదంట. ఈ క్రమంలో నయనతార ఇవాళ ధనుష్ కి ఓ ఓపెన్ లెటర్ రాసింది. ఆ లెటర్ చదివిన తర్వాత చాలామంది విస్తుబోయారు.

మూడు పేజీల ఆ లెటర్ సారాంశం ఏమిటంటే.. “ధనుష్, నీ తండ్రి ఆశీసులతో, అన్న సహకారంతో పెద్ద స్టార్ హీరోగా ఎదిగిన నువ్వు ఇంత దిగజారతావని నేను అస్సలు ఊహించలేదు. ఇండస్ట్రీ నుండి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన మహిళను నేను. నా నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నాకు ఎంత ముఖ్యం అనేది నీకు కూడా తెలుసు. కానీ.. నువ్ కావాలని నా మీద పగతో ఆ డాక్యుమెంటరీ రిలీజ్ అవ్వకుండా అడ్డుపడుతున్నావ్. రెండేళ్లుగా నీ నుండి NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) కోసం ప్రయత్నించినా నువ్వు అస్సలు పట్టించుకోలేదు.

పైగా సినిమాకి సంబంధించిన 3 సెకండ్ల బీటీఎస్ (బిహైండ్ ది స్క్రీన్) ఫుటేజ్ వాడుకున్నందుకు ఏకంగా 10 కోట్ల రూపాయల దావా వేశావు. అయితే.. ఇది నువ్వు బిజినెస్ పరంగా చేసి ఉంటే నేను అర్థం చేసుకునేదాన్ని. కానీ నువ్ మా మీద పగతో ఇలా చేయడం ఎంతమాత్రం సహించలేము. నువ్ నీ ఆడియో లాంచ్ ఈవెంట్లలో స్టేజ్ మీద చేసే నటనకు నీ క్యారెక్టర్ కి సంబంధం లేదు. “నానుమ్ రౌడీదాన్” విడుదలై 10 ఏళ్లవుతోంది. కానీ.. సినిమా రిలీజ్ కి ముందు నువ్వు అన్న మాటలు ఇప్పటికీ మర్చిపోలేను.

అంతలా హర్ట్ చేసావు మమ్మల్ని. ముఖ్యంగా సినిమా విడుదలయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడాన్ని నువ్వు జీర్ణించుకోలేకపోయావు. అప్పటినుండి నా మీద, విఘ్నేష్ మీద రగిలిపోతున్నావు. ఇప్పటికైనా నీ నెగిటివ్ మైండ్ సెట్ నుండి బయటపడు. ఈ ప్రపంచంలో అందరికీ చోటు ఉంది. నువ్వు ఈ విషయమై నీ నెక్స్ట్ ఆడియో ఫంక్షన్ లో ఏదో ఒక కవరింగ్ డైలాగులు వేసుకుంటావ్. కానీ.. మనిషిలా మారి ప్రపంచానికి శాంతిని పంచు. నా నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీను నువ్వు కూడా చూడు.

అప్పుడైనా నీకు ఆ డాక్యుమెంటరీ ఎందుకు తీశామో, మాకు ఎందుకంత ముఖ్యమో అర్థమవుతుంది” అని చెప్పుకొచ్చింది నయనతార. నయనతార ఈ స్థాయిలో ఓ స్టార్ హీరో మీద మండిపడడం అనేది ప్రస్తుతం చెన్నై వర్గాల్లో సంచలనం రేకెత్తించింది. మరి ఈ విషయమై ధనుష్ & టీమ్ ఏమని రెస్పాండ్ అవుతాడో చూడాలి. ఇకపోతే ధనుష్ – నయనతార కలిసి “యారాడి నీ మోహిని” అనే తమిళ సినిమాలో నటించారు. ఇది తెలుగులో వచ్చిన “ఆడవారి మాటలకు అర్థాలు వేరులే”కి రీమేక్ లాంటిది.

కీర్తి సురేష్ పెళ్లి టాపిక్.. ఈసారి ఎలా రియాక్ట్ అవుతుందో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus