Kasthuri, Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్..ను కెలికిన నటి కస్తూరి
- April 20, 2024 / 11:23 PM ISTByFilmy Focus
ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించినప్పటికీ… తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూ వచ్చింది కస్తూరి (Kasthuri Shankar) . అయితే అటు తర్వాత బుల్లితెరపై ప్రసారమయ్యే గృహలక్ష్మీ సీరియల్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ సీరియల్ లో ఈమె తల్లి పాత్ర చేసింది. కానీ ఈమెకు సినిమాల్లో ఎక్కువ ఆఫర్లు రావడం లేదు. ఈ విషయం పై ఆమె ఓపెన్ గానే చెప్పుకొచ్చింది. మహేష్ బాబు వయసు నా వయసు ఒక్కటే అని.. అయినప్పటికీ తనకు ఛాన్సులు రావడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
కస్తూరి మాట్లాడుతూ… “కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ‘డెవిల్’ (Devil) సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. సీత చేసిన తల్లి పాత్ర నేను చేయాల్సింది. కానీ నేను యంగ్ గా కనిపిస్తున్నానని తీసేశారు. రజినీకాంత్ (Rajinikanth) ‘కాలా’ (Kaala) చిత్రంలో కూడా నేను చేయాలి. అయితే రజనీ పక్కన పిల్లలకు తల్లిగా అంటే సెట్ కానని తీసేశారు. ఆ పాత్రలో ఈశ్వరీ రావు (Easwari Rao) గారు చేశారు. ఆ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. వయసు పెరుగుతోందని అందరూ బాధ పడతారు.. కానీ, నాకు వయసు పెరగడం లేదు.

నేను యంగ్ గానే కనిపిస్తాను… నా ఫేస్ అలాంటిది.నా జుట్టుకు రంగు కూడా వేసుకోను. ఇప్పటికిప్పుడు మదర్ క్యారెక్టర్లు వేయలేను. మహేష్ బాబు (Mahesh Babu) వయసు, నా వయసు ఒక్కటే. అలాంటప్పుడు అతనికి తల్లిగా నేను ఎలా నటించగలను” అంటూ చెప్పుకొచ్చింది. వాస్తవానికి కస్తూరి మహేష్ కంటే ఏడాది పెద్దది అంతే..!
















