‘ప్రయాణం’ ‘ఊసరవెల్లి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ ఘోష్ ఆ తరువాత పెద్దగా కనిపించలేదు. అయితే ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గతంలో కథ చెప్పాలని నన్ను గదిలోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఆయన ‘బాంబే వెల్‌వెట్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఆ చిత్రంలో నన్ను ఎంపిక చేసుకోవాలంటే .. తనతో పడక సుఖాన్ని పంచుకోవాలని, అతనితో ఎంతో సన్నిహితంగా మెలగాలని చెప్పాడు.అలా అయితేనే భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తానని కూడా చెప్పాడు.అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం అస్సలు తప్పే కాదట.
అలా ఉండాలని కోరుతూ అనురాగ్ నన్ను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తుండగా… నేను తప్పించుకున్నాను” అంటూ అనురాగ్ కశ్యప్ పై ఆరోపణలు చేసింది పాయల్ ఘోష్. ఇవి బాలీవుడ్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఏకంగా నరేంద్ర మోడీని ట్యాగ్ చేసి మరీ ఈ విషయాన్ని జాతీయం చేసింది పాయల్ ఘోష్. అయితే ఇలాంటి ఆరోపణల వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటూ సౌత్ కు చెందిన ఓ సీనియర్ హీరోయిన్ కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె మరెవరో కాదు కస్తూరి శంకర్. ‘నిప్పురవ్వ’ ‘అన్నమయ్య’ ‘ఆకాశవీధిలో’ ‘డాన్ శీను’ వంటి తెలుగు చిత్రాల్లో ఈమె నటించింది.ప్రస్తుతం ‘గృహలక్ష్మి’ వంటి సీరియల్లో కూడా నటిస్తుంది.
ఇక ఈమె పాయల్ ఆరోపణలు పై స్పందిస్తూ.. “అనురాగ్ పై నువ్వు చేసిన ఆ ఆరోపణలు కోర్టులో నిలబడలేవు.నేరాన్ని స్పష్టంగా ధృవీకరించే ఆధారాలు లేకుండా లైంగిక వేధింపుల ఆరోపణలు వల్ల నీకు జరిగే న్యాయం ఏమీ ఉండదు. వీటి వల్ల ఇద్దరిలో ఒక్కరి కెరీర్ మాత్రం నాశనమవుతుంది” అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ వ్యాఖ్యలను చూసిన ఓ నెటిజన్.. ‘ఇదే మీ కుటుంబంలోనో, లేక మీకు అత్యంత సన్నిహితమైన మహిళలకు జరిగితే.. మీరు ఇలాగే ప్రస్తావిస్తారా..?’ అని ప్రశ్నించాడు. దానికి కస్తూరి రియాక్ట్ అవుతూ.. ‘నా కుటుంబంలో ఏంటి.. నేనే అలాంటి పరిస్థితులను ఫేస్ చేశాను. నన్ను కూడా వేధించారు’ అంటూ జవాబిచ్చింది.
@anuragkashyap72 has forced himself on me and extremely badly. @PMOIndia@narendramodi ji, kindly take action and let the country see the demon behind this creative guy. I am aware that it can harm me and my security is at risk. Pls help! https://t.co/1q6BYsZpyx
Actress Payal Ghosh has accused Anurag Kashyap of sexual assault.
Legal view: Allegations of sexual assault without tangible or corroborative evidence are near impossible to prove . But They can ruin either one or all of the names involved. Nothing Good. https://t.co/Gw0RNuPikm