ఓ పొలిటికల్ మీటింగ్ కి హాజరైన సీనియర్ నటి కస్తూరి (Kasthuri Shankar) తెలుగు వాళ్ళ గురించి నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ‘అంతఃపురంలో రాణులకి సేవలు చేయడానికి మగవాళ్ళు వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయినట్టు.. తమిళనాడుకి వచ్చిన తెలుగు వాళ్ళు కూడా అలా సెటిల్ అయిపోయారని’ ఆమె చేసిన చిల్లర కామెంట్లు ఆమె కొంప ముంచాయి. తెలుగు సంఘాలు, పండితులు ఆమెపై మండిపడ్డారు. దీంతో ఆమెపై కేసు ఫైల్ అవ్వడం.
కస్తూరి పరారవ్వడం. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో ఆమెను చెన్నై పోలీసులు అరెస్టు చేసి చెన్నైకి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత బెయిల్ పై బయటకు వచ్చింది కస్తూరి. అప్పటి నుండి కొంచెం వివాదాలకు దూరంగా ఉంటున్న ఈమె తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టిస్తుంది. కస్తూరి తన ట్వీట్ ద్వారా స్పందిస్తూ.. “తెలంగాణ పోలీసులు ఈ వీకెండ్లో నన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో. ఒకవేళ అరెస్ట్ చేస్తే అది కుట్రపూరితంగా అవుతుంది.
ఎందుకంటే.. సంక్రాంతి కారణంగా కోర్టుకి రెండు వారాల పాటు సెలవులు ఉంటాయి. అప్పుడు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉండదు. కొంతకాలం రిమాండ్లో ఉండాల్సిందే.ఈ అవమానకర సమాచారం నిజం కాకూడదని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే కేటీఆర్ అరెస్ట్ గురించి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కస్తూరి సెటైరికల్ గా ఈ ట్వీట్ వేసినట్టు అంతా అనుకుంటున్నారు.