Kriti Sanon: ప్రభాస్ పై ప్రశంసలు కురిపించిన కృతి సనన్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆది పురుష్. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 16వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది ఈ క్రమంలోనే సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. గతంలో ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా పెద్ద ఎత్తున వివాదాలను విమర్శలను ఎదుర్కొంది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో రామాయణంలో ఉన్నటువంటి కీలకమైన ఘట్టాలన్నింటిని కూడా చూపించారు. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఒక విజువల్ వండర్ లాగే ఉందని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా నటి కృతి సనన్ సీతమ్మ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో నటి కృతి సనన్ (Kriti Sanon) మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రభాస్ మంచితనం ఏంటో మనకు తెలిసిందే మంచితనానికి మారుపేరు ప్రభాస్ అని ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోని కృతి సనన్ సైతం ప్రభాస్ మంచితనం గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ రాముడు అంత మంచివాడు అంటూ తనపై ప్రశంసల వర్షం కురిపించింది.ఈ విధంగా కృతి సనన్ ప్రభాస్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో ప్రభాస్ కృతి సనన్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారట పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక మాల్దీవ్స్ లో వీరి నిశ్చితార్టానికి కూడా ఘనంగా ఏర్పాట్లు జరిగాయి అంటూ వార్తలు రావడంతో ఈ వార్తలను వీరిద్దరూ ఖండించారు. అయితే ఈ సినిమా కార్యక్రమంలో ప్రభాస్ గురించి కృతి సనన్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో మరోసారి వీరిద్దరి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus