Laya: ప్రముఖ నటి లయ నెల జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన లయ ప్రస్తుతం తెలుగులో రీఎంట్రీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. లయ కూతురు త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఒక ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. 2011 సంవత్సరం నుంచి తాను ఐటీ సెక్టార్ లో జాబ్ చేశానని లయ తెలిపారు.

ఇండియాలోని ప్రముఖ ఐటీ సంస్థ కోసం తాను పని చేశానని ఆమె చెప్పుకొచ్చారు. నాలుగు సంవత్సరాల పాటు తాను ఫుల్ టైం ఎంప్లాయ్ గా పని చేశానని లయ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తనకు 12000 డాలర్లు వేతనంగా వచ్చేదని ఆమె వెల్లడించారు. ఇప్పటి లెక్కల ప్రకారం నెలకు 9,60,000 రూపాయలు వేతనంగా లభించేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. 2017 సంవత్సరంలో తాను ఉద్యోగానికి దూరమయ్యానని లయ తెలిపారు.

జాబ్ కు దూరమైన తర్వాత నేను డాన్స్ స్కూల్ పెట్టానని కరోనా సమయంలో అది కూడా మానేశానని లయ కామెంట్లు చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మొదలుపెట్టానని ఆమె చెప్పుకొచ్చారు. అప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్ చాలా మారిందని లయ కామెంట్లు చేశారు. న్యూయార్క్ సిటీతో పోల్చి చూస్తే నాకు హైదరాబాద్ బాగుందని లయ అభిప్రాయం వ్యక్తం చేశారు.

లయ వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. లయ (Laya) కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇతర నటీమణులకు భిన్నంగా లయ అడుగులు వేస్తున్నారు. లయ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి రోల్స్ ను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు లయ రేంజ్ పెరుగుతుండగా ఆమె సక్సెస్ రేట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అభినయ ప్రధాన పాత్రల్లో ఆమె ఎక్కువగా నటించారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus