Meena, Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మీనా!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న మీనాకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దృశ్యం, దృశ్యం2 తెలుగు సినిమాలు ఈ మధ్య కాలంలో మీనాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. తాజాగా మీనా పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి, ఐశ్వర్యారాయ్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మీనా తన సినీ కెరీర్ లో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ లో నటించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న సీనియర్ హీరోలందరికీ మీనా జోడీగా నటించారు. కొన్ని నెలల క్రితం భర్తను కోల్పోయిన మీనా ఆ దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మీనా మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. తాజాగా తన ఫ్రెండ్ తో కలిసి విదేశీ పర్యటన చేసిన మీనా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఐశ్వర్యారాయ్ గురించి ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.

పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యారాయ్ పోషించిన నందిని పాత్ర తన డ్రీమ్ రోల్ అని ఆ పాత్రను కొట్టేసిన ఐశ్వర్యారాయ్ ను చూస్తుంటే నాకు అసూయ కలుగుతోందని మీనా చెప్పుకొచ్చారు. నా లైఫ్ లో ఒకరిని చూసి అసూయ పడటం ఇదే తొలిసారి అని మీనా కామెంట్లు చేశారు. పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించిన నటీనటులందరికీ అభినందనలు అని మీనా చెప్పుకొచ్చారు.

మీనా చేసిన పోస్ట్ కు కు 40,000కు పైగా లైక్స్ వచ్చాయి. మీనా కెరీర్ పరంగా మరిన్ని ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మీనా పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా తనకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలకు మాత్రమే ఓటేస్తున్నారు. మీనా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సాధించి క్రేజ్ ను మరింత పెంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus