‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ నేహా మాద్ర సీమంతం ఫోటోలు వైరల్..!

ఈరోజుల్లో మహిళలు గర్భం దాల్చడం.. దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఇప్పటి కాలంలో మహిళలు ఫుడ్ సరిగ్గా తీసుకోవడం లేదు. మరోపక్క ఉమ్మనీరు శాతం కూడా తగ్గిపోయి అబార్షన్లకు దారి తీస్తున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది ఒకపక్క అయితే కొంతమంది దంపతులకు పెళ్ళై.. ఏళ్ళు గడుస్తున్నా గర్భం దాల్చలేని ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకు ఒక్క కారణం అని చెప్పలేం. చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఇలా గర్భం దాల్చడానికి చాలా సమయం పట్టిన వారిలో నేహా ముద్ర కూడా ఒకరు.

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ అభిమానులకు ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. విషయం ఏంటంటే.. నేహా మాద్ర.. పెళ్ళై 10 ఏళ్ళు పూర్తయ్యేవరకు ఈమెకు సంతానం కలగలేదు. అయితే ఈమె భర్తతో కలిసి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈమె త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ క్రమంలో ఆమె అత్తింటివారు ఘనంగా ఈమెకు సీమంతం కూడా జరిపారు. ఈ నేపథ్యంలో నేహా మాద్ర ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి..

తన సీమంతం ఫోటోలను కూడా షేర్ చేసింది. ‘నా కడుపులో ఉన్న బిడ్డపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారు. ఈ సీమంతం అనేది నాకు ఓ కలలా అనిపిస్తుంది. నా అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను’ అంటూ పేర్కొంది. ప్రస్తుతం నేహా మాద్ర సీమంతం ఫోటోలు వైరల్ గా మారాయి :

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus