డ్రీమ్‌గర్ల్’ తో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరుచా. ఇటీవల ‘ఛత్రపతి’ (హిందీ వెర్షన్)లో నటించిన ఆమె త్వరలో ‘అకేలీ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘డ్రీమ్‌గర్ల్’కు సీక్వెల్‌గా రానున్న ‘డ్రీమ్‌గర్ల్-2’లో తాను భాగం కాకపోవడంపై మాట్లాడారు. ‘‘డ్రీమ్‌గర్ల్’లో నేను కథానాయికగా నటించా. ఆ చిత్రబృందం అంటే నాకెంతో ఇష్టం. వాళ్లతో కలిసి వర్క్ చేయడాన్ని ఎంతగానో మిస్ అవుతున్నా.
‘డ్రీమ్‌గర్ల్ -2’లో నాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదో తెలియదు. ఈ ప్రశ్నకు చిత్రబృందం మాత్రమే సమాధానం చెప్పగలదు. నాకు అవకాశం ఇవ్వనందుకు ఎంతో బాధపడుతున్నా. విషయం ఏదైనా సరే తమకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాగే, నాక్కూడా ఈ విషయం గురించి బాధపడే హక్కు ఉంది. ఆ బాధ చెప్పే స్వేచ్ఛ కూడా ఉంది’’ అని ఆమె తెలిపారు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘డ్రీమ్‌గర్ల్’.
2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్‌గా ‘డ్రీమ్‌గర్ల్-2’ సిద్ధమైంది. అనన్యాపాండే కథానాయిక. రాజ్ శాండిల్యా దర్శకుడు. ఆగస్టు 25న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజున నుష్రత్ నటించిన ‘అకేలీ’ కూడా విడుదల కానుంది. భాషా భేదం లేకుండా అలరించిన హిందీ చిత్రం ‘ప్యార్ కా పంచ్‌నామా’.
ఆ మూవీతో సినీ అభిమానులందరి దృష్టినీ ఆకర్షించిన నటి (Actress) ‘నుస్రత్ భరూచా’. ఈ కథానాయిక తెలుగు ప్రేక్షకులకూ పరిచితమే 2010లో వచ్చిన ‘తాజ్ మహల్’ సినిమా ద్వారా! వెండితెర కంటే ముందు చిన్నతెర.. ఇప్పుడు వెబ్‌స్క్రీన్ మీదా కనిపిస్తూ నిత్యం లైమ్‌లైట్‌లో మెరిసిపోతోంది నుస్రత్.