Pragathi: ‘ఎఫ్3’ విషయంలో నాకు అంత సీన్ లేదు: ప్రగతి

వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్2’ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ఎఫ్3’ కూడా రూపొందింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన సినిమా కాబట్టి… దీని పై మంచి అంచనాలే నెలకొన్నాయి.ఈ చిత్రంలో సోషల్ మీడియా సెన్సేషన్ ప్రగతి కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ‘ఎఫ్2’ వచ్చే వరకు ప్రగతిలో ఆ రేంజ్ కామెడీ యాంగిల్ ఉందని ఎవ్వరికీ తెలీదు.

ఇప్పుడు కరోనా లాక్ డౌన్ వల్ల ఆమె క్రేజ్ పెరిగింది కాబట్టి.. ‘ఎఫ్3’ లో ఆమె పాత్ర పై అంచనాలు పెరిగాయి. అయితే ‘ఎఫ్3’ కథే తెలీదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రగతి. ఆమె మాట్లాడుతూ.. ‘ఎఫ్2’ లో 50 శాతం వినోదం ఉంటే ‘ఎఫ్ 3’ లో 100 శాతం వినోదం ఉంటుంది.ఈ సినిమాలో కూడా నా పాత్రని దర్శకుడు చక్కగా డిజైన్ చేశారు.నా పాత్ర కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది.

‘ఎఫ్3’ కథ నాకు అంత కనెక్ట్ అయ్యిందా అని చాలా మంది అడుగుతున్నారు. నాకు అంత సీన్ లేదు.ఈ చిత్రం కథ నాకు తెలీదు.దర్శకుడు చెప్పలేదు. నా పాత్ర వరకే చెప్పారు” అంటూ ప్రగతి చెప్పుకొచ్చింది. ఇక ‘ఎఫ్3’ హీరోల గురించి ప్రగతి మాట్లాడుతూ.. ” వరుణ్ తేజ్ క్విక్ లెర్నర్. ఏదైనా చూడగానే, వినగానే పసిగడతారు.ఇక వెంక‌టేష్‌ గారి గురించి చెప్పాల్సిన పని లేదుగా..! ఆయన సెట్‌లోకి రావడమే యాక్ష‌న్ మూడులోకి వెళ్ళిపోతారు.

దర్శకుడు అని రావిపూడి చాలా పాజిటివ్ గా రియాలిటీ కి చాలా దగ్గరగా, లాల్జ‌ర్ దేన్ లైఫ్ ఆలోచన కలిగి ఉంటారు. అమాయ‌కత్వం తో కూడిన పాత్ర‌ల‌తో ఆయన సినిమాలు ఉంటాయి.నిర్మాత దిల్ రాజు గారు అంటేనే కుటుంబ కథా చిత్రాలకు మంచి విలువైన చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన బేన‌ర్‌లో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంటుంది.త‌మ‌న్నా, మెహ్రిన్ నా కూతుర్లు లాంటివారు” అంటూ చెప్పుకొచ్చారు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus