ఈ లాక్ డౌన్ టైములో సోషల్ మీడియాలో ఎక్కువ హల్ చల్ చేసిన సినీ సెలబ్రిటీలలో నటి ప్రగతి కచ్చితంగా ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆమె నటించిన సినిమాల్లో హీరోలకు తల్లి, వదిన, అత్త వంటి పాత్రల్లోనే చాలా ట్రెడిషనల్ కనిపిస్తూ వచ్చింది. ‘దూకుడు’ ‘ఎఫ్2’ వంటి సినిమాల్లో తన కామెడీతో కూడా అదరగొట్టింది. అయితే ఈ లాక్ డౌన్లో మాత్రం కొత్త ప్రగతిని చూపించిందనే చెప్పాలి.
షూటింగ్ లు లేకపోవడంతో ఈమె ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టింది. యోగ చేస్తున్న ఫోటోలను,మాస్ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను.. అలాగే ఒకానొక టైములో బైక్ నడుపుతున్న వీడియోను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి కూడా.! ఇప్పుడు మరో వీడియోతో కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది ప్రగతి. జిమ్ లో వర్కౌట్ లు చెయ్యడం మాత్రమే కాకుండా..
రకరకాలుగా జంప్ చేస్తూ ఆశ్చర్యపరిచింది. ‘ఇక నుండీ బోల్డ్ పాత్రలు చెయ్యడానికి కూడా నేను రెడీ’ అన్నట్టు ఈమె ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తున్నట్టు నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఏమైనా 44ఏళ్ళ వయసులో కూడా ఇంతలా ఆమె కష్టపడుతుండడం మామూలు విషయం కాదనే చెప్పాలి.
View this post on Instagram
I never look back darling. It distracts from now💯
A post shared by Pragathi Mahavadi (@pragstrong) on
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video
ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!