తల్లి, అత్త పాత్రలతో మనందరికీ దగ్గరైన నటి ప్రగతి. ఏడాదిలో విడుదలయ్యే సినిమాల్లో ఈమె లేని సినిమాలు వేళ్ళ మీదే లెక్కేసుకోవచ్చేమో. సెంటిమెంట్, సహజత్వం మాత్రమే కాకుండా కామెడీ కూడా చెయ్యగలను అని ‘బాద్ షా’ చిత్రంతో నిరూపించింది. ఇక గతేడాది విడుదలైన ‘ఎఫ్2’ చిత్రంలో ఈమె చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. గడసరి అత్త పాత్రలో … హీరో వెంకటేష్ తో సమానంగా కామెడీని పండించింది.
ఈమెలో ఇంత కామెడీ యాంగిల్ కూడా ఉందా అనేంతలా ఈమె నటించింది. ఇంతేనా అనుకుంటే మొన్నటికి మొన్న ‘రాయల్ ఎన్ ఫీల్డ్ బండి నడుపుతూ’ ఉన్న వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక లాక్ డౌన్ టైములో తన బాడీని షేప్ చేసుకోవడానికి రక రకాల ఆసనాలు వేస్తూ … హాట్ హాట్ గా ఉన్న తన ఫోటోలను పోస్ట్ చేసింది. అంతే కాదు.. తన టాటూ వేయించుకున్న ఫోటోలను సైతం షేర్ చేసింది.
ఈమె గ్లామర్ రోల్స్ కు కూడా రెడీ అవుతుందా అనే అనుమానాలు కలిగేలా ఆ ఫోటోలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా… ఓ తీన్మార్ పాటకి లుంగీ కట్టుకుని మాస్ స్టెప్పు లు వేసి దుమ్ము దులిపేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. దీంతో ఐటెం సాంగ్స్ కూడా తను చేయడానికి రెడీ అని పరోక్షంగా హింట్లు ఇస్తుందా అనే కామెంట్స్ పెడుతుంటే.. మరికొంత మంది ‘ప్రగతి ఆంటీ ఎనర్జీ సూపర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Most Recommended Video
View this post on Instagram
Actress #Pragathi massive dance with her son!
A post shared by Filmy Focus (@filmyfocus) on
అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!