లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ నటి ప్రగతి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాల్లో తల్లి, వదిన, అక్క వంటి పాత్రలతో మహా అయితే .. ఒకటి లేదా రెండు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తూ వచ్చిన ప్రగతి.’దూకుడు’ ‘బాద్ షా’ ‘ఎఫ్2’ వంటి చిత్రాల్లో మాత్రం కాస్త లెంగ్త్ ఉన్న పాత్రలు చేసి.. తన లోని కామెడీ యాంగిల్ ను బయటపెట్టింది.ఇక ఈ లాక్ డౌన్ టైములో మాత్రం యోగా చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రగతి.
అంతేకాదు మాస్ పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలను అలాగే బైక్ నడుపుతున్న వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇటీవల ‘బొంబాయి’ సినిమాలోని ‘హమ్మ హమ్మ’ అనే సూపర్ హిట్ పాటకు కూడా అదిరిపోయే స్టెప్పులు వేసింది ప్రగతి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. 44 ఏళ్ళ వయసులో కూడా ఈమె ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు తనలోని మరో యాంగిల్ ను కూడా బయటపెట్టింది ప్రగతి.లేడీ బ్రూస్ లీ లా ఫైట్స్ చేస్తున్నట్టు ఆ వీడియో ఉంది.వీటన్నిటినీ బట్టి చూస్తుంటే.. భవిష్యత్తులో తల్లి, అత్త పాత్రలకు గుడ్ బై చెప్పేసి బోల్డ్ పాత్రలకు కూడా రెడీ అనేలా ఉంది ప్రగతి..! ఇక ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
Most Recommended Video
View this post on Instagram
Actress #Pragathi latest work out 🏋️♀️
A post shared by Filmy Focus (@filmyfocus) on
ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!