ఆ హీరోలను రెగ్యులర్ గా కలుస్తుంటాను.. తప్పేంటి : ప్రియా ఆనంద్

రానా- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన ‘లీడర్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియా ఆనంద్. మొదటి చిత్రంతోనే ఆకట్టుకున్న ప్రియకు ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘180’ వంటి క్రేజీ చిత్రాల్లో కూడా నటించే ఛాన్స్ దక్కింది. కానీ ఆ చిత్రాలు ఆడకపోవడంతో తొందరగానే ఈమె టాలీవుడ్ కు దూరమయ్యింది. అయితే దివంగత శ్రీదేవీతో కలిసి నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రం ప్రియకు మళ్లీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందనే చెప్పాలి .గత కొంతకాలంగా కొంతమంది హీరోలతో ఈమె ప్రేమాయణం సాగిస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

దివంగత నటుడు మురళి కుమారుడు మరియు యంగ్ హీరో అయిన అధర్వ తో ఈమె ప్రేమలో ఉందని రూమర్స్ వచ్చాయి. అటు తర్వాత సీనియర్ హీరో కార్తీక్‌ కొడుకు గౌతమ్‌తో కూడా ప్రియా ఆనంద్‌ ప్రేమాయణం నడిపింది… అధర్వకు బ్రేకప్ చెప్పేసింది అంటూ కూడా వార్తలు వచ్చాయి. అంతేకాదు త్వరలోనే గౌతమ్ ను పెళ్ళి చేసుకోబోతుంది ప్రియా ఆనంద్ అంటూ కూడా గాసిప్స్ వచ్చాయి.

ఈ వార్తల పై ప్రియా ఆనంద్ స్పందించింది. ‘నేను ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను. గౌతమ్ మరియు అధర్వలు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ .మేం ముగ్గురం రెగ్యులర్ గా కలుసుకుంటూ ఉంటాము. మా పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటాము. అంతేతప్ప మరేమీ లేదు’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియా ఆనంద్.

Most Recommended Video

నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Share.