నేను పదోతరగతి చదివేటపుడు ఈ వ్యక్తి పరిచయం అయ్యాడు.. ఆయన్ని నేను కేక్ అని పిలుస్తాను. అతను మణిమాల్ నుంచీ ఇంజనీరింగ్ చేసి హీరో అవుదామని వచ్చాడు. అయితే, అప్పుడు నేను ఒక స్టూడియోకి ఫోటో షూట్ కి వెళ్లాను పోర్ట్ ఫోలియో కోసం. అతను కూడా అక్కడికి అందుకే వచ్చాడు. నన్ను ఇష్టపడి మా ఇంటికి వచ్చి అడిగారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, మా పేరెంట్స్ చాలా టైమ్ తీస్కున్నారు.
అప్పుడు నాన్నగారి పరిస్థితికూడా బాలేదు. ఆర్ధికంగా బాగా చితికిపోయాం.. చాలా లాసెస్ అయ్యాయి. నాన్నగారు ఆర్మీలో ఉండేవారు. రిటైర్డ్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి బాగా నష్టపోయారు. అందుకే నేను కంపల్సరీ వర్క్ చేయాల్సి వచ్చింది. అప్పుడు పెళ్లి అంటే ఫ్యామిలీని వదిలేసి వెళ్లలేను అన్నాను. మా అత్తగారు వాళ్లు ఒప్పుకోలేదు.. వదల్లేదు. మా పేరెంట్స్ కూడా ఒప్పుకోక తప్పలేదు. మొదటి ప్రేమ గురించి చెప్పాలంటే అది అతని గురించే చెప్పాలి.
నిజంగా ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ, నా ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ప్రేమ, ఇష్టం ఏది ఉన్నా కూడా దానికి విలువలేదు. ఆ విషయాన్ని నేను లేటుగా తెలుసుకున్నాను.ఇప్పుడు నేను మ్యారేజ్ అయిన మహిళనా.. లేదా డివోర్స్ నా, లేదా సెపరేట్ గా ఉంటున్నానా అనేది నాకే తెలీదు. నా మ్యారేటియల్ స్టేటస్ నాకే తెలీదు చెప్పాలంటే., అతను ఎవరైనా, ఎలా ఉన్నా, ఎక్కడున్నా అతనే నా ఫస్ట్ లవ్.
అతని పేరు కిషోర్ అంటూ చెప్పింది ప్రియ. ఇక మాకు ఒక ఒక బాబు ఉన్నాడు పేరు నిశ్చయ్. సోనూ అని ముద్దుగా పిలుచుకుంటాం అంటూ చెప్పి ఎమోషనల్ అయ్యింది ప్రియ.