Priyanka Chopra: ఎవరు తెలిసేది కాదు… బాగా భయపడ్డాను!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు దూరమైన హాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ తాను 20 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు.

మొదట్లో తనకు ఎవరూ తెలిసేది కాదు. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత చాలా భయపడ్డానని ప్రియాంక చోప్రా తెలిపారు. చిన్న విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకునే దానిని.ఏదైనా సినిమా ఫెయిల్ అయిన లేదా సినిమా అవకాశాన్ని మిస్ చేసుకున్న మానసికంగా తాను ఎంతో బాధపడేదాననీ తెలియజేశారు. ఇలా కెరియర్ మొదట్లో ఎంతో భయపడిన నేను తాను చూసినటువంటి బిగ్ స్టార్స్ తో కలిసి నటించే అవకాశాలను అందుకున్నాను.

ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందనీ,ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి, కెరియర్లో తాను సాధించిన సక్సెస్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ హాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు.

తాజాగా ఈమె (Priyanka Chopra) సిటాడెల్ వెబ్ సీరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం ఈ దంపతులు ఒక పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా అమెరికాలోనే స్థిరపడిన విషయం తెలిసిందే.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus