టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో హీరోయిన్స్‌ను ‘మీకే హీరో అంటే ఇష్టం?’ అని అడిగితే… ఓ పేరు చెబుతుంది. ఇండస్ట్రీలో కుదురుకున్నాక కొన్ని రోజులకు అడిగితే అందరూ ఇష్టమే అని చెబుతుంది. ఇంకాస్త డీప్‌గా అడిగితే.. కొన్ని పేర్లు బయటకు వస్తాయి. అందులో కచ్చితంగా స్టార్ హీరోలు ఉంటారు. ఇప్పటివరకు ఆమె నటించని హీరోలు ఉంటారు. ఇప్పుడు అలా వచ్చిన పేరు ప్రభాస్.. ఆ మాట చెప్పిన హీరోయిన్ రష్మిక.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మికను యాంకర్ ‘మీకు ఏ హీరోతోనైనా డేట్‌కి వెళ్లే అవకాశం వస్తే ఎవరితో వెళ్తారు?’ అని అడిగింది. దానికి రష్మిక.. ఆయన ఛాన్స్ ఇవ్వాలే కానీ డేట్‌కి రెడీ అని చెప్పుకొచ్చింది. ఇక్కడ ఆయన అంటే ప్రభాస్ అన్నమాట. దీంతో డార్లింగ్ అభిమానులు ‘రష్మిక కూడా మా పార్టీయే’ అని ఆనందపడుతుంటే.. ఇంకొందరు మాత్రం సినిమా ఛాన్స్ కోసం కాకా పడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా ఛాన్స్ కోసం రష్మిక ఇలా అంటుందా అంటే…
ఏమో మరి. అయినా ప్రభాస్ అంటే రష్మికకు ఇష్టం ఉండకూడదా చెప్పండి. అందరిలాంటి అమ్మాయే కదా రష్మిక కూడా. ప్రభాస్ కటౌట్‌ను చూసి ఏ అమ్మాయైనా ఫిదా అయిపోతుంది అంటారు. అలాంటప్పుడు రష్మిక ఫిదా అవ్వడంలో తప్పేం లేదు. ఈ లెక్కన ప్రభాస్ కూడా వరుస సినిమాలు ఓకే చేసేస్తున్నాడు. అందులో ఏదో ఒక సినిమాలో రష్మికకు ఛాన్స్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!