Rashmika: నాపై ఎందుకిలా అటాక్ చేస్తున్నారు… వైరల్ అవుతున్న రష్మిక కామెంట్స్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలకు ఎలాంటి అభిమానం ఉంటుందో అదే స్థాయిలో విమర్శించే వారు కూడా ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ప్రశంసలు విమర్శలు అనేవి సర్వసాధారణం.ఈ క్రమంలోనే కొందరు నటీమణులు ఇలాంటి విమర్శలను పెద్దగా పట్టించుకోరు అయితే పట్టించుకోలేదని వారి గురించి మితిమీరిన విమర్శలు రావడంతో సదరు సెలబ్రిటీలు కూడా తమ గురించి వస్తున్నటువంటి విమర్శలపై నోరు విప్పక తప్పదు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక గురించి ఇదివరకు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి.

అయితే ఈ మధ్యకాలంలో రష్మిక తన గురించి వస్తున్న ట్రోల్స్ పై స్పందించి వారికి తనదైన శైలిలో సమాధానాలు చెబుతున్నారు.ఇదివరకే పలుమార్లు ట్రోలర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈమె తాజాగా మరోసారి తన గురించి వచ్చే ట్రోల్స్ పై స్పందించారు. సాధారణంగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై తాను పెద్దగా స్పందించను.ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది కనుక వారికి తోచినది వారు మాట్లాడుతూ ఉంటారని వదిలేసే దాన్ని.

అయితే ఇలా స్పందించకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని ఈమె తెలియజేశారు ఒకప్పుడు ఈ ట్రోల్స్ కేవలం నన్ను మాత్రమే బాధపెట్టేవి అయితే ఇప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా బాధ పెట్టడంతో తాను స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. నా గురించి ఏ విధమైనటువంటి వార్తలు వస్తున్నా తన తల్లిదండ్రులు ఏంట్రా ఇది విన్నాం నిజమేనా అని తనని ప్రశ్నిస్తున్నారని అలాగే తన చెల్లెలు అక్క నీ గురించి స్కూల్లో ఇలా మాట్లాడుకుంటున్నారు నిజమేనా అంటూ తనని ప్రశ్నిస్తుందని ఈమె తెలిపారు.

గత ఆరు సంవత్సరాల నుంచి నేను ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నాను.నేను ఇప్పటివరకు ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు అయినా నన్ను ఎందుకు అటాక్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. నేను ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నారో లేదో నాకు అర్థం కావడం లేదు. అసలు సమస్య ఏదైనా ఉంటే నాతో చెప్పండి కానీ ఇలా దుర్భాషలు మాట్లాడవద్దు అంటూ రష్మిక మరోసారి తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus