సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటేనే వారిపై సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఫోకస్ చేసి ఉంటుంది. వాళ్లు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసినా క్షణాలలో వైరల్ అవ్వడమే కాకుండా వారి గురించి కూడా పెద్ద ఎత్తున నేటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇలా నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలా తమ గురించి సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఆ వార్తలను ఖండిస్తూ ఉంటారు.
మరికొందరైతే వారి గురించి వచ్చే ట్రోల్స్ గురించి పట్టించుకోవడమే మానేస్తుంటారు. ఈ క్రమంలోనే నటి రితిక సింగ్ సైతం తాజాగా తన గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి రితికా సింగ్ అనంతరం నీవెవరో శివలింగ వంటి సినిమాలలో కనిపించి సందడి చేశారు. ఇలా ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా తమిళంలో నటించిన కార్ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి రితికా సింగ్ సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై తీవ్రస్థాయిలో మండిపడుతూ వాటిని ఖండించారు. ఇక సోషల్ మీడియాలో తన ఫోటోలను పెద్ద ఎత్తున మార్ఫింగ్ చేసి పోస్టులు చేశారని అయితే ఆ ఫోటోలను చూసిన ఆ క్షణం తన గుండె ఆగినంత పని అయ్యిందని తెలిపారు.
తమకు ఓ కుటుంబం ఉంటుంది. తమ ఇంట్లో తల్లిదండ్రులు అన్నదమ్ములు తమ గురించి ఇలాంటి వార్తలను ఇలాంటి ఫోటోలను కనుక చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఈమె ప్రశ్నించారు. ఇక తన గురించి పెద్ద ఎత్తున మీమ్స్ క్రియేట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారని తన గురించి నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారని ఈమె ఆవేదన చెందారు. ముందు మహిళలను గౌరవించడం నేర్చుకోండి.సెలబ్రిటీ మహిళలను మాత్రమే కాదు మిడిల్ క్లాస్ మహిళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ వారిని గౌరవించాలని ఈమె కోరారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?