Sai Pallavi: దేవుడా.. హీరోయిన్ సాయిపల్లవి ఆస్తుల విలువ అంతా?

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవికి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సాయిపల్లవి సినిమాలు చేసినా చేయకపోయినా ఆమెకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తన యాటిట్యూడ్ ద్వారా సాయిపల్లవి ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. సాయిపల్లవి స్టార్ హీరోలకు జోడీగా నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నా ఆమె మాత్రం అభినయ ప్రధాన పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రీమేక్ సినిమాలలో అవకాశాలు వస్తున్నా సాయిపల్లవి సున్నితంగా తిరస్కరిస్తున్నారు.

సినిమాల్లో పూర్తిస్థాయిలో అవకాశాలు తగ్గితే మాత్రం డాక్టర్ గా కెరీర్ ను కొనసాగించాలని సాయిపల్లవి ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. రౌడీ బేబీ సాయిపల్లవి కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో ఎలాంటి తప్పటడుగులు పడకుండాఆమె జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయిపల్లవి రెమ్యునరేషన్ 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సాయిపల్లవి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హీరోయిన్ సాయిపల్లవి ఆస్తుల విలువ 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. యాడ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే ఈ బ్యూటీ ఆదాయం మరింత పెరిగేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సాయిపల్లవి తన స్థాయినిపెంచే సినిమాలలో నటించాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సైతం సాయిపల్లవికి ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.

సాయిపల్లవి (Sai Pallavi) బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ప్రాధాన్యత ఇస్తే కెరీర్ పరంగా మరింత ఎదుగుతారని కొంతమంది చెబుతున్నారు. సాయిపల్లవి నటనకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫిదా అవుతున్నారు. సాయిపల్లవి నటన కొత్తగా ఉండటంతో తన డ్యాన్స్ తో సైతం సాయిపల్లవి ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తారనే సంగతి తెలిసిందే. సాయిపల్లవి బాలనటిగా కూడా పలు సినిమాల్లో నటించారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus