Sreeleela, Prabhas: హీరోయిన్ శ్రీలీలకు ప్రభాస్ దిమ్మతిరిగే షాక్.. అసలేమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం శ్రీలీల బిజీగా ఉన్న స్థాయిలో మరే హీరోయిన్ బిజీగా లేరనే సంగతి తెలిసిందే. శ్రీలీల రెమ్యునరేషన్ సినిమాను బట్టి కోటి రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. శ్రీలీల డిమాండ్ చేస్తే మరింత ఎక్కువ మొత్తం పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే స్టార్ హీరోయిన్ శ్రీలీలకు ప్రభాస్ భారీ షాకిచ్చారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా మేకర్స్ మొదట శ్రీలీల పేరును పరిశీలించారని అయితే చివరకు నిధి అగర్వాల్ ను ఎంపిక చేశారని సమాచారం.

ఈ విధంగా శ్రీలీల ఆఫర్ ను నిధి సొంతం చేసుకుందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్త గురించి శ్రీలీల నుంచి ఎలాంటి రియక్షన్ వస్తుందో చూడాలి. హీరోయిన్ శ్రీలీల రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో ప్రభాస్ కు జోడీగా ఛాన్స్ వస్తుందేమో చూడాలి. ఇప్పటికే శ్రీలీలతో కలిసి నటించిన హీరోలు సైతం ఆమెతో మళ్లీమళ్లీ కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీలీల మరో మూడేళ్ల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో హవా చూపించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాబోయే రోజుల్లో శ్రీలీల మరిన్ని విజయాలను అందుకుంటే ఇతర భాషల దర్శకనిర్మాతలు సైతం శ్రీలీల నామస్మరణ చేసే ఛాన్స్ అయితే ఉంది. శ్రీలీల ఇప్పటికే ఇతర భాషలకు సంబంధించిన కొన్ని ఆఫర్లను రిజెక్ట్ చేసినట్టు భోగట్టా. ప్రస్తుతం శ్రీలీల విశ్రాంతి లేకుండా పని చేస్తోంది. నెలకో సినిమా చొప్పున రాబోయే ఐదు నెలలు శ్రీలీల బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారని తెలుస్తోంది. శ్రీలీల క్రేజ్, పాపులారిటీ వేరే లెవెల్ అని టాలెంట్ కు లక్ తోడు కావడంతో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus