Actress Srilakshmi: కుటుంబాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన సీనియర్ నటి శ్రీ లక్ష్మి!

  • July 11, 2023 / 01:23 PM IST

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఎందరో నటీనటులు కమెడియన్లుగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉన్నత స్థాయికి చేరేది కొందరే. ఇది మన టాలీవుడ్ లో చెప్పాలి అంటే బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్బీ శ్రీరామ్, ఎం. యస్ నారాయణ లాంటి మంచి మేల్ కమెడియన్స్ ఉన్నారు. అయితే టాలీవుడ్‌లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే మేల్ కమెడియన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహిళా హాస్యనటులు కూడా ఉన్నారు. కాబట్టి లేడీ కమెడియన్స్ విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చేది శ్రీలక్ష్మి పేరు.

శ్రీలక్ష్మి (Actress Srilakshmi) ఇప్పుడు తెరపై కనిపించకుండా పోయింది కానీ శ్రీలక్ష్మి తెరపై కనిపిస్తే మాత్రం అరటిపండు లాంబ లంబా.. బంగాళా బూబౌ.. అబ్బా జబ్బా డబ్బా.. బాబు చిట్టి.. అంటూ తన వింత డైలాగ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా 500కు పైగా చిత్రాల్లో నటించారు. తాజాగా శ్రీలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తన గురించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మేం నాన్నకు ఎనిమిది మంది పిల్లలం. ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా కొనసాగుతున్న తరుణంలో నాన్న అమర్నాథ్ ఇండస్ట్రీలో పెద్ద హీరో.

కామెర్లు రావడంతో నాన్న పని మానేశాడు. సైడ్ క్యారెక్టర్లు వస్తే హీరోగానే నటిస్తానని, లేకుంటే చచ్చిన హీరో హోదాతో చచ్చిపోతానని పట్టుబట్టేవాడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత అమ్మ నన్ను సినిమా రంగంలోకి పంపాలని నిర్ణయించుకుంది. కానీ తండ్రికి అది నచ్చలేదు. ఇండస్ట్రీలో అమ్మాయిలు కష్టపడుతున్నారు పరిస్థితి బాగోలేదునా చేతకాని తనం వల్లే ఇలా మాట్లాడుతున్నావు కదమ్మా అని నాన్న బాధపడేవారు. కానీ అమ్మ మాత్రం నువ్వు నటిస్తేనే అందరం కడుపు నిండా తినగలం లేదంటే విషం తాగి చస్తాం అని మాట్లాడేదని చెప్పుకొచ్చింది శ్రీలక్ష్మి.

ఇక తండ్రి అమర్‌నాథ్ మరణంతో కుటుంబాన్ని పోషించేందుకు శ్రీలక్ష్మి సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. సినిమాలు తీయాలని ప్రయత్నిస్తూనే, కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభోదయం, బాపు దర్శకత్వం వహించిన వంశవృక్షం చిత్రాల్లో కథానాయికగా నటించే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాల్లో చేయలేకపోయానని శ్రీలక్ష్మి వెల్లడించింది.‘రెండు జడల సీత’ చిత్రానికి ఉత్తమ ఫీమేల్ కమెడియన్ గా శ్రీలక్ష్మి అవార్డును కూడా దక్కించుకున్నారు. దాదాపు 13 ఏళ్ల పాటు తిరుగులేని కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో శ్రీలక్ష్మి నటించారు

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus