Urvashi Rautela Remuneration: ‘ది లెజెండ్‌’ కోసం హీరోయిన్ ఊర్వశీ రౌతేలాకి భారీ పారితోషికం..!

‘ది లెజెండ్‌’ అనే పాన్ ఇండియా చిత్రం గత వారం రోజులుగా ట్రెండింగ్లో ఉంది.అలా అని ఆ సినిమాపై క్రేజ్ ఉందని కాదు.. ట్రోలర్స్ గురి ఉంది కాబట్టి..! ఈ చిత్రం హీరో అరుళ్ శరవణన్ ను భారీగా ట్రోల్ చేసిన జనాల కారణంగా ఈ సినిమా ట్రెండింగ్లో నిలిచింది. 51 ఏళ్ల వయసులో అతను హీరోగా ఎంట్రీ ఇవ్వడం, తనే నిర్మాతగా మారి రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తీసుకోవడం,అందులో స్టార్ క్యాస్ట్ నటించడం,

ముఖ్యంగా హీరోయిన్ గా ఊర్వశీ రౌతేలా నటించడంతో ఈ సినిమా పేరు చాలా మంది జనాల నోట్లో నానింది. డబ్బుంటే కలలు నెరవేర్చుకోవడం ఈజీ అంటూ హీరో అరుళ్ శరవణన్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఆయన ఈ సినిమాలో నటించి, నిర్మించింది పాపులర్ అవ్వడం కోసం, తన బిజినెస్ ను ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం అనే చర్చ కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా వంటి స్టార్ హీరోయిన్ ఎలా నటించింది అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది.

కచ్చితంగా డబ్బు కోసమే ఆమె నటించి ఉండవచ్చు అనే విషయం పై మాత్రం క్లారిటీ ఉంది. అయితే ఆమెకు ఈ చిత్రం కోసం పారితోషికం ఎంత వరకు అంది ఉండవచ్చు అనే అంశం కూడా చర్చ జరుగుతూనే ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో నటించినందుకు గాను ఊర్వశీ రౌతేలాకు రూ.20 కోట్ల భారీ పారితోషికం ఇచ్చాడట శరవణన్. ఈ ఒక్క సినిమాకి ఆమె తీసుకున్న పారితోషికంతో దీపికా పడుకొణే, అలియా భట్‌, ప్రియాంక చోప్రా వంటి స్టార్‌ హీరోయిన్ల సరసన చేరిపోయింది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus