ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటీమణి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇండస్ట్రీలో అన్ని భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు. అదేవిధంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా కూడా ఎంతో అద్భుతంగా నటించి లేడీ అమితాబ్ అనే బిరుదును కూడా సంపాదించుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయశాంతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన చిన్నప్పుడే తన తండ్రి చనిపోయారని ఆ బెంగతో తన తల్లి కొంతకాలానికి మరణించిందని తెలిపారు. అయితే తాను ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో పైకి వచ్చానని తెలిపారు. తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు తనకు 5000 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అయితే అందులో కాస్త ఎగ్గొట్టి 3 ఇచ్చేవారని తెలిపారు. ఇలా 3000 నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి తాను ఎదిగానని ఈమె తెలిపారు.
అయితే తన సినీ కెరియర్లో తాను ఎన్నోసార్లు చావు అంచు వరకు వెళ్లి వచ్చానని ఈ సందర్భంగా విజయశాంతి తన సినీ కెరియర్ గురించి గుర్తు చేసుకున్నారు. ఒకసారి విమాన ప్రమాదం, అలాగే మరోసారి నీటిలో కొట్టుకపోవడం, ఇంకోసారి మంటల్లో చిక్కుకోవడం వంటి ఎన్నో సంఘటనలలో తాను ప్రమాదానికి గురైయ్యానని తెలిపారు.ఒక తమిళ సినిమా షూటింగ్ జరిగే సమయంలో తనని ఒక గుడిసెలో బంధించి గుడిసెకు నిప్పు పెట్టాలి.
అయితే ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో గాలి ఎక్కువగా రావటం వల్ల అగ్గి తన చీర పై పడిందని దాంతో మంటలు పెద్దగా వ్యాపించాయని అయితే అది చూసిన వారందరూ భయపడి పారిపోగా హీరో విజయ్ కాంత్ మాత్రం లోపలికి వచ్చి నన్ను కాపాడారంటూ ఈ సందర్భంగా విజయశాంతి తన సినీ కెరియర్లో తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలిపారు.