Yamuna: ఆ సమయంలో చనిపోవాలనుకున్నా.. నటి యమున వ్యాఖ్యలు

సినిమాలు, సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి యమున. తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాల్లో నటించారు. తన అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకున్నారు. హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2011లో బెంగుళూరులోని ఓ హోటల్ లో వ్యభిచారం చేస్తూ.. ఆమె పట్టుబడిందనే వార్త అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ కేసులో విటుడిగా సాఫ్ట్‌వేర్ కంపెనీ సిఈవోను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

దీంతో యమున కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. వ్యభిచారి అనే మాటలు భరించలేక ఆమె మీడియాకి కూడా దూరమయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనలోని బాధను, ఆవేదనను పంచుకున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. కావాలనే వ్యభిచారం కేసులో తనను ఇరికించారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు ఆ రోజు తను ఏ హోటల్ కి వెళ్లలేదని.. వ్యభిచారి అనే మచ్చతో బతకాలనిపించలేదని అన్నారు. ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు.

తాను చనిపోతే పిల్లలకు చెడ్డపేరు రాకుండా ఉంటుందని భావించానని.. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. పిల్లలకు ఆస్తులు వీలునామా రాసి.. తాను చనిపోవాలనుకున్నట్లు తెలిపారు. కానీ తన స్నేహితురాలు బ్రెయిన్ వాష్ చేయడంతో.. ఆ ఆలోచన విరమించుకున్నట్లు వెల్లడించారు. పిల్లల కోసం మనోధైర్యాన్ని నింపుకున్నట్లు చెప్పారు. ఎదుటివారి మాటలను అసలు పట్టించుకోకూడదని.. మనమేంటో మనకి తెలుసనేది చాలా బుక్స్ చదివి నేర్చుకున్నట్లు యమున తెలిపారు.

ఎవరూ తన ఎమోషన్స్ టచ్ చేయలేరనేది మైండ్ లో ఫిక్స్ అయినట్లు.. ఇంకో క్షణం కూడా బ్రతికి ఉండలేమనే పరిస్థితి వస్తాయి కానీ అవన్నీ క్షణికావేశాలే అని.. ఆ మూమెంట్ దాటితే ఎంత పెద్ద సమస్య అయినా.. చిన్నదే అవుతుందని యమున చెప్పుకొచ్చారు. ఇప్పుడు నటిగా మళ్లీ బిజీ అయ్యారు యమున. పలు సీరియల్స్ లో నటిస్తూ.. కాలం గడుపుతున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus